హౌస్ మేట్స్ ని ఎంటర్టైన్ చేసిన సుహాసిని.. తమ బ్రేకప్ స్టోరీలు చెప్పిన గౌతమ్, నిఖిల్!

బిగ్ బాస్ సీజన్ 8 ఎండింగ్ కి వచ్చేసింది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే హౌస్మేట్స్ ని ఎంటర్టైన్ చేసే క్రమంలో మామగారు సీరియల్ నుంచి సుహాసిని, ఆకర్ష్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. సుహాసిని హౌస్ లో ఉన్న నిఖిల్, ప్రేరణ, అవినాష్ కి మంచి ఫ్రెండ్. దాంతో వాళ్ళని కాసేపు ఆటపట్టించి తర్వాత అందరినీ కూర్చోబెట్టి మీ ఫస్ట్ బ్రేకప్ ని ఎలా హ్యాండిల్ చేశారు చెప్పండి అంటూ అందరినీ అడిగారు. నిఖిల్ తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఫస్ట్ లవ్ బ్రేకప్ అయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్లాను,

తరువాత తను ఇండస్ట్రీ లోకి వెళ్లడం, తన ఫస్ట్ సినిమా పోస్టర్ కాలేజీ పక్కన థియేటర్లో కటౌట్ పడటం, అది చూసి నాకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి వచ్చి సారీ చెప్పిందని కానీ తాను అప్పటికే ఆమెని బ్లాక్ చేసేసానని చెప్పిన నిఖిల్ నువ్వు హర్ట్ అవుతావని వదిలేసి వెళ్ళిపోవటం కూడా ప్రేమే అలాంటిది ఈ జనరేషన్లో అంత ఈజీగా దొరుకుతుందని నేను అనుకోవడం లేదు అంటూ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు నిఖిల్. ఇక గౌతమ్ అయితే కాలేజీలో ఉన్నప్పుడే తనకి ఫస్ట్ రిలేషన్షిప్ ఏర్పడిందని ఆమెని పెళ్లి చేసుకుందామనే సమయానికి కొన్ని రీజన్స్ వల్ల జరగలేదు.

ఆ సమయంలో తాను బాధతో డిప్రెషన్ కి వెళ్ళినప్పుడు తన ఫ్యామిలీ తనకి చాలా సపోర్ట్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. మనతో ఎవరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండటానికి రాలేదు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని లైఫ్ చాలా హ్యాపీగా జాలీగా గడిపేసుకుంటూ వెళ్లాలని అర్థం చేసుకున్నాను అని చెప్పాడు. ఆ తరువాత బ్రహ్మముడి సీరియల్ నుంచి కావ్య హౌస్ లోకి వచ్చి హౌస్ మేట్స్ ని తనదైన స్టైల్ లో కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళని మరింత ఎంటర్టైన్ చేసింది.