నమ్మకద్రోహి అంటూ గౌతమ్ ను దూరం పెట్టిన రిషి… గౌతమ్ విషయంలో బాధపడుతున్న మహేంద్ర!

గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే రిషి షర్టు మార్చుకోవడం కోసం గౌతం ఇంటికి వెళ్తాడు.అక్కడే మహేంద్ర వాళ్ళు ఉన్నారని తెలుసుకున్న రిషి గౌతమ్ ను తీవ్రస్థాయిలో తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.నేను డాడ్ వాళ్లు కనిపించలేదని ఎంతగా బాధపడ్డాను నువ్వు చూసావు అయినా కూడా డాడ్ వాళ్ళు నీ దగ్గరే ఉన్నారనే విషయం నాకు చెప్పకుండా నన్ను మోసం చేసావ్ నువ్వు ఫ్రెండ్ కాదు నమ్మకద్రోహివి అంటూ రిషి గౌతమ్ విషయంలో సీరియస్ అవుతాడు.

చిన్నప్పటినుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండుకొని నన్ను ఇలా మోసం చేస్తావని అనుకోలేదు అంటూ తిడుతూ ఉండగా గౌతం నిజం చెప్పే ప్రయత్నం చేసిన రిషి వినిపించకుండా ఇక్కడ ఉన్నట్టు అంకుల్ చొప్పదని చెప్పారు అని గౌతమ్ చెప్పినా… నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా నేను నమ్మను నువ్వు నన్ను మోసం చేసావ్ ఇకపై ఎప్పటికీ నా కంటికి కనిపించకు అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరూ కారులో వెళుతుండగా తప్పు గౌతమ్ సర్ ది మాత్రమే కాదు జగతి మేడం మహేంద్ర సార్ ది కూడా కావచ్చు కదా అంటూ వసుధార మాట్లాడుతుంది. అంటే నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా వసుధార అంటూ కారు ఆపుతాడు.

జగతి మేడం మహేంద్ర సార్ ఎలాంటి పరిస్థితులలో అక్కడికి వెళ్లారు గౌతమ్ సార్ ఈ విషయం మనకు చెప్పకపోవడానికి కారణాలేంటో మనకు తెలియదు. కేవలం తప్పు గౌతమ్ సర్ ది కాదు కదా చెప్పినప్పటికీ నువ్వేనైనా చెప్పు వాడు మిత్రదోహి అంటూ కోపం తెచ్చుకుంటాడు.మరోవైపు దేవయాని ఆలోచిస్తూ వెళ్ళిపోయిందనుకున్న జగతి వచ్చింది. అలాగే రిషిని వారి వైపు తిప్పుకుంటున్నారు. ఏం చేస్తే వీరి ఆగడాలు ఆగిపోతాయి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రిషి వసుధార ఇద్దరు వస్తారు.

రిషి చాలా కోపంగా పైకి వెళ్ళగా వసుధారని దేవయాని అడ్డుకొని ఏంటి అప్పుడే వచ్చారు తెల్లారే వరకు రారని అనుకున్నానే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.ఇక దేవయాని అలా మాట్లాడేసరికి ఇప్పుడు ఏం మాట్లాడినా రిషి సార్ డిస్టర్బ్ అవుతాడని సైలెంట్ గా ఉండడంతో దేవయాని రెచ్చిపోయి మాట్లాడుతుంది. రిషి పైకి వెళ్ళగా మహేంద్ర పడుకొని ఉంటాడు దీంతో రిషి బయటకు రావడంతో రా రిషి అంటూ మహేంద్ర పిలుస్తాడు. ఏంటి ఈ అవతారం అని మహేంద్ర అడగడంతో షర్ట్ పాడవడంతో గౌతమ్ ఇంటికి వెళ్లాను అక్కడికి వెళ్తే మనసే పాడైపోయింది అంటాడు.

మీరు గౌతమ్ దగ్గరే ఉన్నారనే విషయం నాకు తెలిసిపోయింది డాడ్ అని మీరు అక్కడున్న విషయాన్ని వాడు నాకు చెప్పకుండా నన్ను మోసం చేశాడు అంటూ మరోసారి గౌతంపై సీరియస్ అవుతాడు.ఇందులో గౌతమ్ తప్పు ఏమాత్రం లేదు నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోదామని చెప్పినప్పుడు జగతి వద్దని బ్రతిమిలాడిన నేను వెళ్ళాను ఇక గౌతమ్ నాకు ఆశ్రయం ఇచ్చి చాలా బాగా చూసుకున్నాడు ఇందులో గౌతమ్ తప్పులేదు అని మహేంద్ర చెబుతున్నప్పటికీ రిషి వినకుండా తనని తప్పు పట్టడంతో మహేంద్ర గౌతమ్ విషయంలో ఎంతో బాధపడతాడు.