టైటిల్ రేస్ లో ఉన్న రేవంత్ టైటిల్ గెలవాలంటే ఆ ఒక్కటి మార్చుకోవల్సిందే…?

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా నత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇలా ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇటీవల సెప్టెంబర్ 4వ తేదీ బిగ్ బాస్ సీజన్ 6 కూడా ప్రారంభం అయింది. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరవ వారంలో కొనసాగుతున్న ఈ రియాలిటీ షోలో మొత్తం ఐదు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

ఇక గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ కంటెస్టెంట్లుగా నిలిచే వారి గురించి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సింగర్ రేవంత్ మొదటి స్థానంలో నిలువగా శ్రీహన్ రెండవ స్థానంలో నిలిచాడు. సింగర్ గా మంచి గుర్తింపు పొందిన రేవంత్ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతివారం నామినేషన్ లో రేవంత్ నిలుస్తున్నాడు. బయట రేవంత్ కి ఉన్న ఫాలోయింగ్ వల్ల అధిక సంఖ్యలో ఓటింగ్ దక్కించుకొని టైటిల్ విన్నర్ దిశగా కొనసాగుతున్నాడు. అయితే రేవంత్ ప్రతివారం నామినేట్ అవ్వటం వల్ల ప్రేక్షకులలో నెగెటివిటీ మొదలవుతోంది.

ఇలాగే కొనసాగితే రేవంత్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకడిగా నిలిచే అవకాశం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తించే తీరుతో నెగెటివిటీ మూట కట్టుకుంటున్నాడు. రేవంత్ గేమ్ మీద ఫోకస్ పెట్టకుండా ఇతరులతో తరచూ గొడవలు పడుతూ ప్రతివారం ఎలిమినేషన్ కి నామినేట్ అవుతున్నాడు. అందువల్ల ఇకనుండి అయినా రేవంత్ గేమ్ మీద ఫోకస్ చేసి గొడవలకి దూరంగా ఉంటే కచ్చితంగా టైటిల్ దక్కించుకొనే అవకాశం ఉంటుందని ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.