Chiranjeevi: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత సెలబ్రిటీలు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారని భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత సినిమా సెలబ్రెటీలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి అనే విషయాలను తల్లితండ్రులే నేర్పాలని ఆ బాధ్యత తల్లిదండ్రులది అంటూ సురేష్ బాబు కామెంట్స్ చేశారు.
కచ్చితంగా ఈయన అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు అంటూ సురేష్ బాబు పై విమర్శలు రావడంతో ఆయన చివరికి తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తన ఉద్దేశం ఏంటో బయటపెట్టారు. ఇకపోతే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అమెరికాలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. మనలో కేవలం టాలెంట్ ఉంటే మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఉండాలని చిరంజీవి తెలిపారు. ఎందుకంటే నటీనటులుగా మనం టాలెంట్ మాత్రమే కలిగి ఉండకూడదు. మనలాంటి నటులు చాలామంది ఉంటారు. మనం కాకపోతే ఇంకొకరు వారు కాకపోతే మరొకరు. ఇలా అందరిలో మనం బెస్ట్ అనిపించుకోవాలి అంటే టాలెంట్ తో పాటు వ్యక్తిత్వం కూడా ఉండాలని ఈయన మాట్లాడారు.
చిరంజీవి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ కొందరు మాత్రం అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనీ కామెంట్లు పెడుతున్నారు.ఒకటి రెండు హిట్ల తర్వాత స్టార్ హీరో అయ్యానని యాటిట్యూడ్ చూపించే విజయ్ దేవరకొండ వంటి కుర్ర హీరోలను ఉద్దేశించి ఉన్నాడంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి స్పీచ్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే మాటలు మాట్లాడే వారు కానీ ఇటీవల కాలంలో ఈయన మరో మోహన్ బాబులా తయారవుతూ పరోక్షంగా ఇతరులపై సెటైర్లు వేస్తూ మాట్లాడుతూ ఉంటారంటూ మరికొందరు చిరు వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు.