TG: ఆ ముఖ్యమంత్రి ఎవరు చేయలేని పని రేవంత్ చేస్తున్నారు…. సీఎం పై ప్రశంసలు కురిపించిన ఓవైసీ!

TG: తెలంగాణ ముఖ్యమంత్రిని బిఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తూ తరచు ఆయన పై విమర్శలు కురిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో కొందరు ఈయన నిర్ణయాలను వ్యతిరేకించగా మరికొందరు పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నారు. అయితే తాజాగా రేవంత్ చేస్తున్నటువంటి పనితీరు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు.

ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో ఆస్తులు కోల్పోతున్న యజమానులకు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో నష్టపరిహారం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇలా చెక్కులను పంపిణీ చేయడం పట్ల ఎంపీ అసదుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఈయన మాట్లాడుతూ ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో గతంలో ఐదు మంది ముఖ్యమంత్రులు చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ ఈయన ప్రశంసించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అందుకుగాను బడ్జెట్లో 500 కోట్లు కేటాయించడం సంతోషకరమని ఆయన తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఓల్డ్ సిటీలో మెట్రో పనుల గురించి చర్చలు జరిగాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చిన వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారందరూ కూడా ముఖ్యమంత్రులుగా మారిన ఈ ఓల్డ్ సిటీలో మెట్రో పనుల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి తప్ప పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ఈయన గుర్తు చేశారు.

ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి వెనక్కి తగ్గారన్నారు. ఇలా ఐదుగురు సీఎంలు మాటల వద్దే ఆగిపోయారని, రేవంత్ రెడ్డి మాత్రం చేతల్లో చూపించారని ఓవైసీ సంతోషం వ్యక్తం చేశారు.