ప్రతీ విషయానికీ ఎమోషనల్ అవుతున్న రేవంత్.. నేను వెళ్ళిపోతా అంటూ రచ్చ!

బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై ఇప్పటికే ఐదు రోజులు అయింది. సీజన్ 6 ప్రారంభమైన మొదటి రోజు నుండి కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పటి నుండి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలవటానికి బాగా పోటీ పడుతున్నారు. ఇంకా కొంతమంది సభ్యులు బిగ్ బాస్ ఇంటి వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పట్టేలా ఉంది. ఇక గీతు మాత్రం మొదటి రోజు నుండి దూకుడుగా ప్రవర్తిస్తోంది. ఇక రేవంత్ ప్రతి విషయానికి గట్టిగా నోరు చేసి అందరినీ తన కంట్రోల్ లో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వారి కూడా గట్టిగా మాట్లాడటంతో రేవంత్ బాగా ఎమోషనల్ అవుతున్నాడు. రేవంత్ బిగ్ బాస్ హౌజ్ లో అడ్జస్ట్ అవ్వటానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది.

ఇటీవల ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిం.ది ఈ నామినేషన్ ప్రక్రియలో ఎక్కువమంది రేవంత్ ని నామినేట్ చేయడంతో రేవంత్ మళ్లీ ఎమోషనల్ ఏరియా కి వెళ్లి ఎవరికీ కనిపించకుండా ఏడవటం మొదలు పెట్టాడు. దీంతో ఆదిత్య రేవంత్ ని కన్విస్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇక గీతు మాత్రం రేవంత్ బిగ్బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లడమే మంచిది అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక మరొకవైపు ఫైమా, ఆరోహి రావు కూడా రేవంత్ ని టార్గెట్ చేసి మాట్లాడటంతో రేవంత్ ఇక నావల్ల కాదు నేను హౌస్ నుండి వెళ్ళిపోతా బిగ్ బాస్ అంటూ పంచాయతీ మొదలుపెట్టాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి జంటగా ఎంటర్ అయిన బుల్లితెర జంట మెరీనా-రోహిత్ ఇద్దరు తరచు గొడవలు పడుతూ ఉన్నారు. మొన్నటి ఎపిసోడ్ కి తాను చెప్పిన మాట వినటం లేదని మెరీనా రచ్చ చేసింది. ఇక తాజా ఎపిసోడ్ లో శ్రీసత్య తో గొడవ పెట్టుకుంది. తన భర్తతో తాను సమయం కేటాయించాటనికి కూడా వీలులేకుండా సత్య వాకింగ్ కి రమ్మనటంతో ఈ గొడవ మొదలు అయ్యింది. ఇక ఆదిత్య, ఆది రెడ్డీ, చంటి ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఏం మాట్లాడకుండా ఉన్నారు.