జబర్దస్త్ రేటింగ్స్ తగ్గిపోవటానికి ఆమె కారణమా..?

Jabardasth : బుల్లి తేర మీద ఎన్నో టీవీ షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇలా ఎన్నో ఏళ్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. 9 సంవత్సరాలగా ప్రసారం అవుతున్న ఈ జబర్దస్త్ కామెడీ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతూ టెలివిజన్ లో ప్రసారం అవుతున్న రియాల్టీ షో లలో నంబర్ వన్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం జబర్దస్త్ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. ఈ షోలో ఎంతో కాలం నుండి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న కమెడియన్స్ తో పాటు జడ్జి లు కూడా జబర్దస్త్ కి దూరమయ్యారు.

మొదట నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిపోవడంతో ఆయనతోపాటు చమ్మక్ చంద్ర, ధనరాజ్ , వేణు వంటి ప్రముఖ కమెడియన్లు బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో కొంత డీలాపడిన జబర్దస్త్ ఆది, సుధీర్ వంటి వారు చేసే స్కిట్లతో మళ్ళీ టాప్ రేటింగ్స్ దక్కించుకుంది. అయితే కొంతకాలంగా జబర్దస్త్ నుండి వలసలు మొదలయ్యాయి. జబర్దస్త్ లో సందడి చేస్తున్న ఆది, శ్రీను, సుధీర్, అభి వంటి ఫేమస్ కామెడియన్లు జబర్దస్త్ కి దూరమయ్యారు. అంతే కాకుండా రోజా కూడా జబర్దస్త్ కి దూరమయ్యింది. జబర్దస్త్ మొదలైన నాటి నుండి జడ్జ్ గా కొనసాగుతున్న రోజా మంత్రి పదవి రావటంతో జబర్దస్త్ కి దూరమయ్యింది.

అయితే నాగబాబు లేకపోయినా కూడా రోజా జబర్దస్త్ ని సక్సెస్ఫుల్ గా జబర్దస్త్ ని ముందుకు నడిపించింది. రోజా వెళ్లిపోయిన తర్వాత వరుసగా శ్రీను, ఆది , అభి, సుధీర్ వంటి కమెడియన్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు గ్లామరస్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి దూరం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోజా గారు జబర్దస్త్ లో లేకపోవటం వల్ల జబర్దస్త్ పరిస్తితి దారుణంగా తయారయ్యింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కిర్రాక్ ఆర్పీ కూడా జబర్దస్త్ గురించి, జబర్దస్త్ యాజమాన్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంతో జబర్దస్త్ రేటింగ్స్ మరింత పడిపోయే అవకాశం ఉంది. అయితే ఆది, రాంప్రసాద్ వంటి వారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కిర్రాక్ ఆర్పీ చెప్పిన మాటలలో నిజం లేదని తేల్చి చెప్పారు.