అంత కామంతో చూడకురా.. యాంకర్ రష్మీ కౌంటర్

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల్లో జడ్జ్‌లు, యాంకర్లు వేసే కౌంటర్లు ఎలా వైరల్ అవుతాయో అందరికీ తెలిసిందే. స్కిట్స్ మధ్యలో వేసే పంచ్‌లు బాగా పేలుతుంటాయి. అయితే అవి స్క్రిప్ట్ ప్రకారం వస్తాయా? లేదా స్పాంటేనియస్‌గా సెటైర్లు వేస్తారా? అన్నది పక్కన పెడితే అవి మాత్రం బాగా క్లిక్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా ప్రోమోలో అయితే అలాంటి సెటైర్లే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

Rashmi Counter To Emanuel in Extra Jabardasth
Rashmi Counter To Emanuel in Extra Jabardasth

వచ్చే వారానికి సంబంధించిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. వచ్చే వారం ఎపిసోడ్‌లో కెవ్వు కార్తీక్ స్కిట్‌లో ఇమ్మాన్యుయేల్ అదిరిపోయే పర్ఫామెన్స్ చేసినట్టు కనిపిస్తోంది. అందులో ఇమ్మాన్యుయేల్ చేసిన పనికి, చూసిన చూపులకు రష్మీ ఇచ్చిన కౌంటర్‌తో సెట్ అంతా షాక్ అయింది. మామూలుగా స్కిట్‌లో భాగంగా ఇమ్మాన్యుయల్ పెళ్లి ఈడు వచ్చింది.. చేసుకోవాలని ఉంది అంటూ కెవ్వు కార్తీక్‌తో అంటాడు.

 

Rashmi Counter To Emanuel in Extra Jabardasth
Rashmi Counter To Emanuel in Extra Jabardasth

అలా అంటుండగానే ఓ అమ్మాయి వచ్చి కుర్చీలో కుర్చుంటుంది. అలా అందమైన అమ్మాయిని చూసిన ఇమ్మాన్యుయేల్ అదోలా చూస్తాడు. అలా ఇమ్మాన్యుయేల్ వింత చూపులపై రష్మీ కౌంటర్ వేస్తూ.. ఒరేయ్ అంత కామంతో చూడకురా ప్రేమతో చూడు అంటూ మొత్తం పరువుతీసేసింది. రష్మీ కౌంటర్‌కు అందరూ పగలబడి నవ్వేశారు.

Extra Jabardasth | 30th October 2020 | Latest Promo | ETV Telugu