Rashmi Gautam: టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా భారీగా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. ఆ తరువాత పలు సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. కానీ సినిమాల ద్వారా అంతగా గుర్తింపు దక్కక పోవడంతో మళ్ళీ బుల్లితెర బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్ గా భారీగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమెకు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఇకపోతే ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోలతో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల రష్మీ కాలికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం దాని నుంచి కోలుకుంటూనే మరోవైపు షోలు చేస్తోంది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో రష్మీ చేసిన ఒక షాకింగ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ఏమి ఉంది అన్న విషయానికి వస్తే.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కాస్త ఇబ్బందులో ఉన్నాను.
https://www.instagram.com/p/DMZflZjyqAJ/?utm_source=ig_web_copy_link
అలానే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినే ఓపిక, తీరిక నాకు లేదు. అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను మళ్లీ బలంగా, ధైర్యంగా తిరిగొస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది. నా శక్తిని నేను పునరుద్ధరించుకోవాల్సిన అవసరముంది. దానికి మీ డిజిటల్ ప్రోత్సాహం అవసరం లేదు. నా ఆత్మవిశ్వాసంతో దాన్ని సాధించుకోలగను. నా దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని నేనెప్పుడు కోల్పోలేదు. అదెప్పుడు నా దగ్గరే ఉంది. అయితే ఎక్కడో ఒక చోట కృంగిపోతున్నాను. వీటన్నింటికీ పరిష్కారం కనుక్కోవాల్సిన సమయం దగ్గరపడింది. సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా లేకపోయినా మీ ప్రోత్సాహం, ప్రేమ, సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను అని రష్మి రాసుకొచ్చింది. ఈ సందర్బంగా రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
