జానకిని హగ్ చేసుకున్న రామ…. కొడుకు చేసిన తప్పుని క్షమించలేకపోతున్న జ్ఞానంభ!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…కొత్త ఇంట్లోకి వెళ్లినటువంటి జ్ఞానంభ కుటుంబ సభ్యులు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటూ ఉంటారు.అయితే చిన్న ఇల్లు కావడంతో కనీసం ఇంట్లో షర్ట్ తగిలించుకోవడానికి హ్యాంగర్ కూడా లేదు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అంటూ అఖిల్ అసహ్యించుకుంటూ ఉంటాడు.దీంతో జెస్సి జానకి సపోర్ట్ గా మాట్లాడటంతో తనేదో నీ సొంత అక్కయినట్టు మాట్లాడుతున్నావ్ ఏంటి ఈయన చేసిన తప్పుకి బయట అందరూ నన్ను అవమానిస్తున్నారు. చేతకాని తమ్ముడి కోసం అన్న అప్పు చేసి రోడ్డు పాలయ్యారని మాట్లాడుతున్నారు అంటూ అఖిల్ కోప్పడతాడు. అయినప్పటికీ జెస్సి జానకికి సపోర్ట్ గా మాట్లాడుతుంది.

ఇక జానకి మొత్తం ఇల్లు శుభ్రం చేసి అన్ని సర్దుతూ ఉండగా గోవిందరాజులు మాత్రం జానకి ఒక్కతే కష్టపడుతుంది నువ్వు కూడా కాస్త సహాయం చేయి మల్లికా అనడంతో తాను ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది.ఇల్లు మొత్తం శుభ్రం చేసిన తర్వాత రామ సరుకులు తీసుకువచ్చారు. అయితే కొన్ని సరుకులు తీసుకురాలేదేంటి అని అడగడంతో డబ్బులు లేవని చెబుతాడు. ఇవన్నీ చాటుగా విన్నటువంటి జెస్సి బాధపడుతుంది. మరోవైపు మల్లికా బయట కనిపిస్తే ఇక్కడ పనులు చెబుతారోనని తన గదిలోనే ఉంటుంది.

ఇల్లు మొత్తం శుభ్రం చేసిన తర్వాత పాలు పొంగించడానికి జానకి అన్ని సిద్ధం చేసి తన అత్తయ్యను పాలు పొంగించమని పిలుస్తుంది. ఆమె మాత్రం ఇలాంటి మంచి పనులు నీ చేతుల మీద గానే చేయి జానకి అని చెబుతుంది.ఇలాంటి పనులు నువ్వు చేస్తేనే బాగుంటుంది జ్ఞానంభ అని గోవిందరాజులు చెప్పడంతో చేయాల్సిన చోట చెప్పాల్సినవి నాకు చెప్పనప్పుడు ఇక్కడ నేను ఉండి ఏం లాభం అని రామా చేసిన తప్పును ఆమె క్షమించలేకపోతోంది. దాంతో గోవిందరాజులు నీ చేతుల మీద గానే పాలు పొంగించు అమ్మ అని జానకికి చెబుతాడు.

ఇక జానకి దేవుడి ముందు జ్ఞానాంబ దీపం చేయడంతో ఆ దీపం తీసుకువచ్చి స్టవ్ వెలిగించి పాలు పొంగిస్తుంది అది చూస్తున్నటువంటి రామా చాలా మంచి పని చేశారు జానకి గారు ఇప్పుడు అమ్మ పాలు పొంగించినట్టే అయ్యింది అంటూ మాట్లాడతారు.ఇలా పాలు పొంగించడం అనంతరం అందరూ వెళ్లిపోవడంతో రామ మాత్రం జానకిని హగ్ చేసుకుంటారు. ఇక మల్లిక మాత్రం తనకు తలనొప్పిగా ఉందని వెళ్లడంతో ఇదివరకు పనులు చేయలేదు ఇప్పుడు అబార్షన్ అయిందని పనుల నుంచి తప్పించుకుంటున్నానని లోపలికి వెళ్ళిపోతుంది అయితే తనకు జానకి పాలు తీసుకువెళ్లగా మల్లిక మాత్రం మరింత ఓవరాక్షన్ చేస్తుంది అప్పుడు జానకి కడుపేలేనప్పుడు ఇంత ఓవరాక్షన్ చేయడం అవసరమా అంటూ తనపై అరుస్తుంది.