అఖిల్ కోసం ఇంటి కాగితాలు తాకట్టు పెట్టిన రామా…. మరోసారి ఇబ్బందులు తప్పవా?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి జానకికలగనలేదు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…రామ అఖిల్ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఇప్పటికిప్పుడు 20 లక్షలు తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో జానకి ఫోన్ చేయడంతో తాను రాలేనని ముఖ్యమైన పని ఉందని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఎలాగైనా అఖిల్ కి ఈ ఉద్యోగం ఇప్పించాలన్న ఉద్దేశంతో రామ ఆలోచిస్తూ ఉండగా తనకు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టడం తప్ప మరో మార్గం లేదని అనుకుంటాడు.

ఇక వెళ్లి అమ్మకు ఈ విషయం చెప్పి ఇంటి కాగితాలు తీసుకుందామని అనగా ఈ విషయం అఖిల్ కి తెలుస్తుంది. ఇది తెలిస్తే తన ఉద్యోగానికి వెళ్ళనని చెబుతాడు అని రామ మనసులో అనుకొని ఇంట్లో వారికి తెలియకుండా ఇంటి కాగితాలు తీసుకొని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్తాడు.ఇంటి కాగితాలు తమ దగ్గర పెట్టుకొని 20 లక్షలు కావాలని మూడు నెలలలో మీ డబ్బు చెల్లించి కాగితాలు తీసుకెళ్తానని రామా చెబుతాడు.రామ మాటమీద నిలబడే వ్యక్తి అంటూ వడ్డీ వ్యాపారి కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలని చెప్పి తెల్లని కాగితంపై సంతకం చేయించుకుంటాడు.

ఇలా రామ తెల్లటి కాగితంపై సంతకం చేసి ఇంటి కాగితాలు వడ్డీ వ్యాపారికి 20 లక్షలు డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు. అనంతరం జానకి కి ఫోన్ చేయడంతో జానకి వదిన ఊర్మిల ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.మరోవైపు తల్లిదండ్రుల వర్ధంతి రోజున జానకి వారిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండగా రామా మాత్రం కొన్ని ముఖ్యమైన పని కారణంగా రాలేకపోతున్నానని ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశానని రామా చెబుతాడు.ఇదే విషయం ఊర్మిళ జానకి తో మాట్లాడుతూ రామా మాటలలో ఏదో కంగారు కనపడుతుంది అని ఊర్మిళ చెప్పగా ప్రస్తుతం ఆయన అఖిల్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అలాగే మామయ్య ఆరోగ్యం కూడా బాగాలేదని జానకి చెబుతుంది.

జానకి అఖిల్ గురించి చెప్పడంతో జానకి అన్నయ్య తనకు ఉద్యోగం ఇస్తానని మాట ఇస్తాడు. మరోవైపు రామా 20 లక్షలు చరణ్ కి కట్టి తనకు తన కంపెనీలో జాబ్ ఇస్తాడు.అయితే 20 లక్షలు తాను కట్టినట్టు చెప్పవద్దని తన ఇంటర్వ్యూ ద్వారా తన చదువుకున్న చదువు ద్వారా ఉద్యోగం వచ్చిందని మాత్రమే చెప్పమని రామ చెబుతాడు. దీంతో రామ అఖిల్ కు ఫోన్ చేస్తాను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారని తనకు ఉద్యోగం ఇస్తాడు.ఇంటికి వచ్చిన రామ అమ్మకు చెప్పకుండా ఎప్పుడు కూడా చొక్కా కొనలేదు కానీ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టాను ఆయన అఖిల్ భవిష్యత్తు కోసమే కదా అని తనని తాను సమర్ధించుకుంటాడు.ఇంటికి వచ్చిన తర్వాత జానకితో రామా జరిగిన విషయం మొత్తం చెబుతాడు అంత డబ్బు ఎక్కడిది అని అడగగా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టానని రామా చెప్పడంతో ఈ విషయం నేను అత్తయ్య గారికి చెబుతాను అంటూ జానకి మాట్లాడుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.