సుమిత్రను చంపబోయిన రాజీవ్…. తన అల్లుడి నిజస్వరూపం తెలుసుకున్న చక్రపాణి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే వసుధార అన్న మాటలను తలుచుకొని రిషి ఒక డాబా దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అసలు వసుధార ఎందుకు ఇలా మాట్లాడింది…. తనకు నాకు ఏ సంబంధం లేదా అంటూ వసుధార మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ రిషిధార నుంచి రిషి విడిపోడు అని అదే విషయాలు గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటాడు.నువ్వు పోలీస్ స్టేషన్లో మీ అమ్మానాన్నలు హాస్పిటల్ లో ఈ సమయంలో నువ్వు వెళ్ళిపో అంటే నేను ఎలా వెళ్ళిపోతా అనుకున్నా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు.

మరోవైపు ఆసుపత్రిలో చక్రపాణి సుమిత్ర ఇద్దరూ ఉంటారు. అయితే అక్కడకు రాజీవ్ వస్తాడు అయితే చక్రపాణి మెలకువలు ఉన్నప్పటికీ మెలకువ లేనట్టుగా నటిస్తుంటాడు. చక్రపాణి మెలకువలో లేడని రాజీవ్ తన శాడిజం మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అయితే సుమిత్ర దగ్గరకు వెళ్లి రాజీవ్ నువ్వు చస్తావు అనుకుంటే బ్రతికి పోయావు మరొక రెండు రోజుల్లో నువ్వు లేచి మామయ్య గారికి జరిగింది మొత్తం చెప్పి నన్ను విలన్ ను చేస్తావు అందుకే నిన్ను ఇప్పుడు పంపిస్తున్నాను అంటూ తనకు మాస్క్ పెట్టడంతో దాన్ని తీసేస్తాడు. ఏదో చెప్పాలనుకుంటున్నావ్ నీ చివరి కోరిక ఏంటి అత్తయ్య నువ్వు చనిపోతే నాకు వసుదారకు పుట్టే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. అయితే అదే సమయంలో రిషి హాస్పిటల్ కు వస్తాడు.

సుమిత్ర ఆక్సిజన్ మాస్క్ లేకపోవడంతో కొట్టుమిట్టాడుతుంది. అది చూసిన రిషి తనకు మాస్క్ తగిలించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ పై అరుస్తాడు. వీళ్లకు ఎంత ఖర్చైనా పర్వాలేదు వీళ్ళు బ్రతకాలి వారికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెబుతాడు. అయితే రాజీవ్ మాటలు విన్నటువంటి చక్రపాణి తన అసలు నిజ స్వరూపం తెలుసుకుంటాడు. అయితే రిషి వచ్చి సుమిత్ర ప్రాణాలను కాపాడటంతో బ్రతికి పోయావు అనుకుంటాడు. అంతలో రాజీవ్ అక్కడికి వెళ్లి నువ్వేంటి ఇక్కడ అనడంతో వసుధార తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంది అని రిషి మాట్లాడతారు అయితే వీరిద్దరి మధ్య మాట పెరిగి గొడవపడతారు.

ఇలా వీరిద్దరు గొడవ పడడంతో డాక్టర్ రిషిని బయటకు పంపిస్తాడు మరోవైపు మహేంద్ర జగతి ఇద్దరు కూడా రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు ఏమో అని కంగారుపడుతూ రిషికి ఫోన్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో జగతి మహీంద్రా కంగారు పడి మనం ఇక్కడుండే ఇక చేసేదేమీ లేదు మనం ఇంటికి వెళ్దాం అనడంతో ఇద్దరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత రిషి గురించి ఆరా తీయగా ధరణి రిషి ఇక్కడికి రాలేదని చెబుతాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.