రాజీవ్ ను చంపి జైలుకెళ్ళిన వసుధార… వసు మెడలో తాళి చూసి షాక్ అయిన రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే… వసుధార అక్కడి నుంచి జగతి మహీంద్ర రిషిలను పంపించేస్తుంది. రాజీవ్ నిజస్వరూపం తాను బయటపెడుతున్నప్పటికీ తన తండ్రి చక్రపాణి మాత్రం నమ్మడు. దీంతో రాజీవ్ వసుధార మెడలో ఉన్నటువంటి తాళిని తెంపి తాను తాళి కడతానని దగ్గరకు వెళ్ళగా వసుధార తనని తోస్తుంది. అదే సమయంలో చక్రపాణి ఉండడంతో ఈ తోపులాటలో చక్రపాణి వెళ్లి పక్కన పడి తన తలకు గాయం అవుతుంది. అయితే అదే సమయంలో వసుధార దీపపు కుందే తీసుకొని రాజీవ్ ను బెదిరిస్తుంది.

దగ్గరకు రాకు బావ వచ్చావంటే చంపేస్తానని బెదిరిస్తూ ఉన్నప్పటికీ రాజీవ్ మాత్రం తన మెడలో ఉన్న తాళి తీసేసి వసుధారకు తాళి కట్టాలని ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే వసుధార దీపపు కుందెతో రాజీవ్ ను పొడుస్తుంది. అయితే తనను హత్య చేసినందుకుగాను వసుధార జైలు పాలవుతుంది. ఇక విషయం తెలుసుకున్నటువంటి జగతి మహేంద్రా రిషి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.అక్కడ ఏం జరిగిందని విషయం గురించి ఆరా తీయగా వసుధార మాత్రం మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి సార్ మీకు నాకు ఏ సంబంధం లేదు అని వసుధార మాట్లాడుతుంది.

వసుధార ఇలా మాట్లాడేసరికి రిషి కూడా చాలా ఓపికగా తనని అడుగుతున్న వసుధార సమాధానం చెప్పకపోవడంతో రిషి వసుధారపై సీరియస్ అవుతూ నీకు నాకు ఎలాంటి సంబంధం లేదా అని ప్రశ్నిస్తారు. అదే సమయంలో వసుధర అటువైపుకు తిరుగుగా తన మెడలో ఉన్నటువంటి తాళి బయటపడుతుంది. ఆ తాళి చూసిన రిషి షాక్ అవుతాడు. ఇక వసుధార మెడలో ఉన్నటువంటి తాళిని చూసిన జగతి సంతోషపడుతుంది. ఆ తాళి వసుధార కోసం జగతి పంపించినది కావడం గమనార్హం.