వసు ప్రేమను అంగీకరించిన చక్రపాణి….. ఊహించని నిర్ణయం తీసుకున్న రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పేడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే… వసు రిషి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు. చేతిరాతలు నీటిపై రాతలని తెలుసుకోలేకపోయాను అంటూ రిషి బాధపడతారు. మరోవైపు వసు తన మెడలో ఉన్న తాళిని అలాగే ఉంగరం పై ఉన్న విఆర్ అనే అక్షరాలను చూస్తూ బాధపడుతూ ఉంటుంది.దూరం ఎంత భారమా వసుధారా నువ్వు మరి తిరిగి ఇంటికి రావా అంటూ రిషి బాధపడగా అంతలోపే జగతి అక్కడికి వచ్చి నువ్వు పంపిన మెయిల్ చూశాను రిషి అని చెప్పి వెళ్తుంది.

ఇంటికి కాలేజ్ స్టాఫ్ వస్తారు వారితో మీరు మాట్లాడండి పెద్దమ్మ అని రిషి దేవయానికి చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. అయితే వసుధార గురించి చెడుగా మాట్లాడిన కాలేజీ లెక్చరర్స్ అక్కడికి రావడంతో దేవయాని వారిని తిడుతున్నట్లు నాటకం ఆడుతుంది దీంతో వాళ్ళు ఈమె మనల్ని వసుదార గురించి అలా మాట్లాడమని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరిని పిలిపించి అడగటం వల్ల ఏం ప్రయోజనం వసు ఇక్కడ లేకపోయినా తను అనుభవించిన బాధ గుర్తుంది ఇక వీరి వల్ల కాలేజీలో ఏ ఆడపిల్ల కూడా ఇబ్బంది పడకూడదని రిషి మాట్లాడతారు. దీంతోదేవయాని వారిని నేనే అలా మాట్లాడమన్నాను ఇప్పుడు రిషి తిడుతుంటే నా పరువు పోయినట్టు ఉంది అని అనుకుంటుంది.

మరోవైపు వసుధార తన తల్లిదండ్రులకు భోజనం తిని పెడుతూ ఉంటుంది. చక్రపాణి మాట్లాడుతూ వసుధార గురించి తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది. తన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి సుమిత్ర అనగా సుమిత్ర వసుధార విషయంలో దేవుడు ఎప్పుడో ఓ నిర్ణయం తీసుకున్నాడని మాట్లాడింది. ఇక చక్రపాణి వసుధార చేతిలో టికెట్ పెట్టి వెళ్లి రిషి సార్ ని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్న తర్వాత నీకు మమ్మల్ని పిలవాలి అనిపిస్తే పిలువు వచ్చి నాలుగు అక్షంతలు వేస్తాం.నువ్వు మట్టిలో పుట్టిన మాణిక్యం చదువులో గెలిచావ్ ప్రేమలో గెలిచావు వెళ్లి నీ రిషి సార్ ని కలుసుకో అంటూ తనని అక్కడి నుంచి పంపిస్తాడు.

మరోవైపు రిషి బ్యాక్ సర్దుకొని నేను వెళ్తున్నాను అని చెప్పడంతో ఎక్కడికి అని ప్రశ్నిస్తారు. కొన్నాలందరికీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని రిషి చెప్పడంతో ఎక్కడి వెళ్తావ్? ఎక్కడికి పారిపోతున్నావ్ అని మహేంద్ర అనడంతో మనుషుల నుంచి పారిపోగలను కానీ మనసు నుంచి పారిపోలేను కదా డాడ్ అంటారు.అప్పుడు దేవయాని మాట్లాడుతూ ఎవరో మోసం చేశారని అనడంతో వెంటనే రిషి పెద్దమ్మ నేను ఎవరో మోసం చేశారని పారిపోలేదు. పారిపోయే అంత పిరికి వాడిని కాదునాకు నేనే నచ్చడం లేదని రిషి అంటాడు. ఆ సమయంలో పనింద్ర మాట్లాడుతుంటే నువ్వు వెళ్తే కాలేజ్ ఎవరూ చూసుకుంటారు అనగా జగతి మేడం చూసుకుంటుంది. అలాగే మినిస్టర్ గారికి కూడా మెయిల్ చేశాను అని రిషి చెబుతాడు. మరి ఎప్పుడు వస్తావు అని అనడంతో ఎప్పుడు వస్తానో అసలు వస్తానో రానీ అంటూ అని రిషి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.