రాజీవ్ నిజ స్వరూపం బయటపెట్టిన చక్రపాణి…. వసుధార ఊహల్లో రిషి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే…. వసుధార తల్లిదండ్రులకు స్పృహ రావడంతో పోలీసులు కేసు విచారణ కోసం హాస్పిటల్ కి వెళ్తారు. అయితే సుమిత్ర మాత్రం తనని పొడిచింది తన అల్లుడే అని చెప్పడానికి భయపడుతుంది. కానీ చక్రపాణి మాత్రం తన అల్లుడిని పొగుడుతూ మాట్లాడటంతో రాజీవ్ తన మామయ్య వద్దకు వెళ్లి అతివినయం ప్రదర్శిస్తాడు దీంతో చక్రపాణి తన అల్లుడి చెంపపై లాగి పెట్టి కొట్టి తన భార్యను పొడిచింది రాజీవ్ అని చెబుతారు. అప్పుడు ఆయన నిజ స్వరూపాలని చక్రపాణి బయట పెట్టడంతో తను అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు కూడా తనని పట్టుకోవడానికి వెంబడిస్తారు. అప్పుడు చక్రపాణి వసుధారను దగ్గరకు తీసుకుంటాడు.

మరో వైపు రిషితను గదికి వెళ్ళగా అక్కడ వసుధర తన గది మొత్తం శుభ్రం చేస్తూ ఉన్నట్లు కనపడుతుంది అయితే ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దు అంటూ తనని కోపడినట్లు ఊహించుకుంటాడు.ఇక వసుధార ఇచ్చిన నెమలి ఈక కూడా విసిరి వేయడంతో అది గాలికి ఎగిరిపోయి తిరిగి వచ్చి తన గుండెల పై పడుతుంది. నిన్నే కాదు నీకు జ్ఞాపకాలను వదిలించుకోవడానికి కూడా నాకు కష్టంగా మారింది అంటూ బాధపడతాడు.ఇక మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి జగతి మాట్లాడుతూ ఉండగా రిషి మాత్రం అక్కడ వసుధారను ఊహించుకొని వసుదార ఆగిపోయావ్ ఏంటి మాట్లాడు వసుధర ఏమైంది అంటూ మాట్లాడతారు. ఆ సమయంలో ఫణింద్ర ఇక్కడ వసుధార ఎక్కడ ఉంది అనడంతో రిషి మౌనంగా ఉంటాడు. ఇక జగతికి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి చెప్పడంతో ఎక్స్లెంట్ వసుధార చాలా బాగా చెప్పావు అంటే మరోసారి వసుధార గురించి మాట్లాడటంతో జగతి మహేంద్ర బాధపడగా అక్కడున్నటువంటి స్టాఫ్ రిషి సార్ కి ఏమైంది వసుధార జపం చేస్తున్నారని మాట్లాడుకుంటారు.

ఇక రిషి అందరికీ సారీ చెప్పి క్లాస్ రూమ్ కి వెళ్లి ఎందుకు వసుధార నన్ను ఇలా టార్చర్ చేస్తుంది. తన జ్ఞాపకాల నుంచి నేనెందుకు బయటపడలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు చక్రపాణి వసుధారను దగ్గరికి తీసుకొని గౌరవం అని ముసుగులో ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా అంటూ ప్రాదేయపడతాడు. రాజు ఎవరో రాక్షసుడు ఎవరో గుర్తుంచుకోలేకపోయాను రిషి సార్ ఫోన్ చేస్తే నేను ఫోన్ పగలగొట్టాను. ఇప్పుడు నా ఫోన్ నుంచి రిషికి ఫోన్ చేసి మాట్లాడు వెళ్లి తనని కలువు అని చెప్పడంతో వెళ్తాను నాన్న తప్పకుండా రిషి సార్ ని కలుస్తాను అంటూ మాట్లాడుతుంది. మరోవైపు క్లాస్ రూమ్ లో కూర్చొని రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉండగా వసుధార కూడా తన ఫోటో చూస్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.