వసుధార కాళ్లపై పడి క్షమాపణలు చెప్పిన చక్రపాణి…. రిషి ఊహల్లో వసుధార!

బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే మీటింగ్ నుంచి బయటకు వెళ్లిన రీషి వసుధార గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. నా ప్రాణం తీయడానికి నన్ను బ్రతికించావా వసుధార అంటూ తనని తలుచుకొని పదేపదే బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వసుధార రిషిని తలుచుకుంటూ సార్ తో మాట్లాడాలి అనుకుంటూ దీంతో చక్రపాణి ఫోన్ నుంచి తనకు ఫోన్ చేసి కేవలం తన మాటలు విని నా ఫోన్లో రికార్డు చేసుకుంటాను అని తన తండ్రి ఫోన్ నుంచి రీషికి ఫోన్ చేస్తుంది.

కాలేజీలో వసుధార గురించి ఆలోచిస్తూ కూర్చున్న రిషికి ఫోన్ రావడంతో కొత్త నెంబర్ కాబట్టి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు అయితే మరేదైనా అవసరం అయి ఉంటుందేమోనని ఫోన్ లిఫ్ట్ చేసి హలో వసుధార నువ్వేనా ఇక్కడ మాట్లాడు అంటూ రిషి మాట్లాడుతూ ఉండగా రికార్డ్ చేస్తుంది.అంతటితో ఫోన్ కట్ చేయడంతో రిషి తిరిగి మరొకసారి అదే నెంబర్ కి కాల్ చేస్తాడు కాల్ కట్ చేస్తూ ఉంటుంది. అయితే రిషి ఫోన్ లిఫ్ట్ చేసిన వసుధార హాస్పిటల్ లో నర్స్ నుంచి రాంగ్ నెంబర్ కి వచ్చిందని చెప్పిస్తుంది.

చక్రపాణి సుమిత్ర హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు అయితే వసుధార బిల్ కట్టడానికి వెళ్తుంది. అప్పటికే రిషి అనే వ్యక్తిబిల్ పే చేశారని చెప్పడంతో నాన్న రిషి సార్ బిల్ పే చేశారట అని వసుధార చెప్పగా నాకు తెలుసమ్మా తను ఇక్కడికి వచ్చారు అప్పుడే తన మంచితనం నాకు అర్థమైందని చక్రపాణి చెబుతాడు. మరోవైపు కాలేజీలో లెక్చరర్స్ వసుధార రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార కాలేజీకి రాలేదు కాలేజీకి రానని చెప్పిన జగతి మేడం కాలేజ్ కు వస్తోంది. రిషి సార్ వసుధార గురించి ఆలోచిస్తున్నాడు అసలు ఏం జరుగుతోంది అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ మాటలు విన్నటువంటి జగతి వారిని తిడుతుంది. ఇక జగతి కాలేజీ లెక్చరర్స్ ని తిట్టడం రిషి విని బాధపడతాడు.

తల్లిదండ్రులను ఇంటికి తీసుకొని వెళ్ళిన వసుధార ఏమైనా కావాలా తినడానికి అన్ని అడగడంతో మంచినీళ్లు తీసుకు రమ్మని చెబుతారు. అయితే చక్రపాణి మాత్రం వసుధార పట్ల తాను ప్రవర్తించిన తీరుకి క్షమాపణలు చెబుతు తన కాళ్లపై పడతాడు. మీరు నా కాళ్ళపై పడటం ఏంటి నాన్న ముందు లేవండి అంటూ వసుధార మాట్లాడుతుంది నువ్వు నా కూతురివి కాదు మా అమ్మవి నేను ఎన్ని మాటలు అన్న అమ్మ లాగా ఎంతో ఓర్పుగా ఉన్నావు.నీ పట్ల నేను ప్రవర్తించిన తీరుకు చాలా సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించమ్మా అంటూ బాధపడతాడు. ఇక ఇంటికి వెళ్లిన రిషి వసుధార ఊహల్లో తేలిపోతూ బాధపడుతూ ఉండగా వసుధార కూడా రిషీని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.