బిగ్ బాస్ 6 లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్… బయటకు వెళ్ళేది ఆమెనా?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతు మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే . ఇక ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 మొదట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా కూడా ప్రస్తుతం చాలా రసవత్తరంగా కొనసాగుతూ మంచి రేటింగ్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారంలో కొనసాగుతోంది. ఇక ఈ తొమ్మిదవ వారం ఈరోజుతో పూర్తి కానుంది. ఇక ఈ 9 వ వారంలో మొత్తం 13 మంది కంటెస్టెంట్లు పోటీ పడగా.. వీరిలో పదిమంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

ఇక ఈ వారంలో టాప్ రేటింగ్స్ తో స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్నవారు కూడా తమ చండాలమైన పర్ఫార్మెన్స్ తో డేంజర్ జోన్ లో నిలబడ్డారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మిషన్ పాజిబుల్ లో కంటెస్టెంట్లు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇక ఈ వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్న రేవంత్, గీతు చౌదరి ప్రవర్తన ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉంది. ప్రతివారం అత్యధిక ఓటింగ్ తో నంబర్ వన్ స్థానంలో ఉంటున్న రేవంత్ బిహేవియర్ రోజు రోజుకి దిగజారి పోతోంది. కోపం వస్తే బూతులు మాట్లాడుతున్నాడు. అలాగే గీతు ఆటతీరు కూడా ప్రేక్షకులకు తెగ చిరాకు తెప్పిస్తోంది.

గీతు ప్రతి గేమ్ లో తన రూల్స్ తాను రాసుకుంటూ ఇది నా స్ట్రాటజీ… నేను ఇలాగే గేమ్ ఆడతాను అంటూ తనని తాను సమర్థించుకుంటోంది. గత వారంలో గీతుని వరస్ట్ పర్ఫార్మర్ అంటూ నాగార్జున క్లాస్ పీకినా కూడా ఆమెలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. ఇక ఈ వారంలో గేమ్ పాస్ లో ఉన్న సమయంలో ఆదిరెడ్డి టీ షర్ట్ దొంగలించటమే కాకుండా అబద్ధాలు కూడా చెప్పింది. దీంతో గీతు పర్ఫార్మెన్స్ చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ఆమెను డేంజర్ జోన్ లో నిలబెట్టారు. ఈ వారం అతి తక్కువ ఓటింగ్ తో గీతూ పదవ స్థానంలో నిలిచి డేంజర్ జోన్ లో ఉంది. అందువల్ల ఈవారం గీతూ ఎలిమినేట్ అవ్వటం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.