బిగ్ బాస్ సత్య షాకింగ్ కామెంట్స్… అది లేకపోతే మన ముఖం కూడా చూడరు అంటూ?

వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా “తొందరపడకు సుందర వదన” అనే వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయిన శ్రీ సత్య కూడా సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న సీరియల్స్ లో కూడా నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇక ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది. ఇక ఈ సీజన్ 6 లో తన ఆటతీరుతో కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తూ ఇప్పటికీ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా ఇటీవల సత్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో అల్లరి చేస్తూ ఎంతో ఆనందంగా కనిపించే శ్రీ సత్య జీవితంలో అంతలేని విషాదం ఉంది. ఇక ఇటీవల శ్రీ సత్య మాట్లాడుతూ.. చిన్నప్పటినుండి తన తల్లిదండ్రులు తనకి ఏ లోటు లేకుండా అల్లారుముద్దుగా పెంచారని చెప్పకు వచ్చింది. ఇక తాను ప్రాణంగా ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న ప్రియుడు తనని మోసం చేశాడని ఆ సమయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని చెప్పకు వచ్చింది. తన పెళ్లి క్యాన్సిల్ అవటంతో అమ్మ అనారోగ్యం పాలైందని.. ఆ సమయంలో అమ్మకు చికిత్స చేయించడానికి డబ్బులకు ఇబ్బంది పడి మూడు రోజులపాటు ఇంట్లో తిండి తిప్పలు లేక కష్టాలు అనుభవించామని చెప్పుకొచ్చింది.

తన తల్లి వైద్యం కోసం సొంత ఇంటిని అమ్మేశారని, ఇప్పటికీ తాను సంపాదించింది మొత్తం తన తల్లి వైద్యానికే సరిపోతుందని సత్య తన మనసులోని బాధను బయటపెట్టింది. సొంత ఇల్లు కొనుక్కోవటం తన తల్లి ఆశయమని ఎప్పటికైనా తన తల్లి కోరికను నెరవేరుస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఈ బిగ్ బాస్ టైటిల్ గెలిచి వచ్చే డబ్బుతో తన తల్లికి వైద్యం చేయించి మళ్లీ మామూలు మనిషిలా చేయాలన్నదే తన కోరిక అంటూ చెప్పకు వచ్చింది. డబ్బులు ఉంటేనే ఎవరైనా మన మొఖాలు చూస్తారని.. డబ్బు లేకపోతే అయిన వాళ్లు కూడా మనల్ని పట్టించుకోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీ సత్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.