పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ గీతు..?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన గీతు రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ రివ్యూవర్ గా గుర్తింపు పొందిన గీతు.. ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి తనదైన శైలిలో ఆట ఆడుతూ మిగిలిన కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చింది. ప్రతిక్షణం టైటిల్ గెలవాలన్న ఆశతో బిగ్ బాస్ రూల్స్ పక్కన పెట్టి తన సొంత స్టాటజీతో ఆట ఆడటం మొదలుపెట్టింది. ఇలా ఎదుటివారి వీక్నెస్ తో ఆట ఆడుతూ తను చేసింది కరెక్ట్ అంటూ తన గురించి తాను గొప్పలు చెప్పుకుంది.

ఇలా అన్ ఫెయిర్ గేమ్ ఆడటంతో గీతు నెగెటివిటీ మూట కట్టుకుంది. దీంతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఒకరిగా ఉండాల్సిన గీతు అనూహ్యంగా తొమ్మిదవ వారంలో ఎలిమినేట్ అయింది. తనమీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ఎలిమినేషన్ ని తట్టుకోలేకపోయింది. దీంతో తనని ఎలిమినేట్ చేయకండి అంటూ వేదిక మీద కన్నీళ్లు పెట్టుకుంది. ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత కొన్ని రోజులు ఏ చానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వని గీతు ఇటీవల మొట్టమొదటిసారిగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూలో గీతూ మాట్లాడుతూ..బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత రెండు రోజులపాటు ఐసోలేషన్ రూమ్ లో ఉంటూ తిండి తిప్పలు మానేసి కేవలం ఎలిమినేషన్ ఎపిసోడ్ చూస్తూ గడిపానని చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత తన తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లినప్పుడు తన గురించి వచ్చిన పాజిటివ్ కామెంట్స్ చూసి కొంతవరకు రిలాక్స్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలో పాన్ ఇండియా సినిమా పుష్ప 2 లో నటించే అవకాశం గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పుష్ప 2 కో డైరెక్టర్ తన నెంబర్ అడిగినట్లు తనకి తెలిసిందని.. కాకపోతే వాళ్లు ఇప్పటివరకు తనతో డైరెక్ట్ గా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చింది.