ఢీ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న పూర్ణ…గుండెలను పిండేసిన వీడియో!

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మల్లెమాలవారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డాన్స్ షో ఢీ ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతుంది ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ కార్యక్రమం 14వ సీజన్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తరచూ జడ్జెస్ మారుతూ అందుబాటులో ఉన్నవారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్లో భాగంగా పూర్ణ శ్రద్ధాదాస్ వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.అలాగే వచ్చేవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో భాగంగా ఓ కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంట్ తో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. అమ్మ సెంటిమెంట్ తో వచ్చే సినిమాలు, సీరియల్స్ ఎప్పుడుహిట్ అవుతాయి అనే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో అమ్మ సెంటిమెంటుతో పెర్ఫార్మెన్స్ చేశారు.

ఇక ఈ డాన్స్ పర్ఫామెన్స్ చూసిన పూర్ణ, శ్రద్ధాదాస్ వంటి వారు ఒక్కసారిగా ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ పర్ఫామెన్స్ చేసిన అనంతరం శ్రద్ధాదాస్ కన్నీటి ధారను పొంగించగా, పూర్ణ మాత్రం ఈ పర్ఫామెన్స్ చూసిన అనంతరం వేదిక పైకి వెళ్లి ఒక్కసారిగా వెక్కివెక్కి ఏడ్చింది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక కంటెస్టెంట్ లా పూర్తి పెర్ఫార్మెన్స్ చూడాలంటే వచ్చేవారం వరకు వేచి చూడాలి.