పూర్ణ నటనకు గుడ్ బై చెప్పేస్తోందా!? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.. ఓ పరి ‘పూర్ణ’మైన అందం గురించి! ఆ అందమే కథానాయిక పూర్ణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ వైపు టీవీ షోలు.. మరో వైపు వెండితెర. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. టీవీషోల్లో జడ్జీగా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ తన అందంతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ మంచి క్రేజ్ ని సైతం తెచ్చుకుంటోంది! పూర్ణ అసలు పేరేంటో తెలుసా? షమ్నా ఖాసిం. సినిమాల్లోకి వచ్చాక పూర్ణగా వెలుగుతోంది! అవకాశం ఉన్నప్పుడల్లా తనకు నచ్చి.. అందరూ మెచ్చుకునే పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
ఇదిలా ఉంటె.. ఈ ముద్దుగుమ్మ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఇచ్చాడట. పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడట.
పెళ్లి సందర్భంగా పూర్ణ భర్త ఇచ్చిన కానుకల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటి విలువ దాదాపుగా రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్.
ఇవే కాకుండా.. ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడట. వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో! అయినప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో.. సరదాగా కాలక్షేపం చేస్తూనే ఉంది పూర్ణ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ వదులుతూ నెటిజనులను ఉత్సాహపరుస్తూనే ఉంది. ఈ మలయాళీ అందం తన అందంచందాలతో గత కొన్నేళ్లుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉంది. పూర్ణ సినీ కెరీర్ విషయానికి వస్తే… అల్లరి నరేష్ హిరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది.
ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు.
ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 పైగానే సినిమాల్లో నటించింది. కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో ఇటీవల పూర్ణ ‘సుందరి’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను రిజ్వాన్ నిర్మించారు. ఈచిత్రం ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. కొంతకాలంగా పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అతి ముఖ్యమైన పాత్రలపై దృష్టి సారించిన్చది.
అందులో భాగంగా ‘సిల్లీ ఫెలోస్’, ‘అఖండ’, ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే… పెళ్లి అవగానే నటనకు గుడ్ బై చెప్పిన సుందరాంగులను చూశాం. మరి పూర్ణ కూడా నటనకు గుడ్ బై చెప్పేస్తోందా? అని ఓ నెటిజను పూర్ణను ప్రశ్నిస్తే.. ‘ససేమిరా.. నటనను మానుకునేదే లేదు. వెండితెరపై మంచి పాత్రలు లభించినప్పుడు తప్పకుండా చేస్తూనే ఉంటా’ అని సమాధానమిచ్చింది.