8 ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డని తల్లి వద్దకు చేర్చిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షో..?

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతి ఆదివారం ప్రసారం అవుతూ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ బాగా ఆకట్టుకుంటుంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పిస్తూ జీవితాన్ని కల్పిస్తోంది. ఇటీవల ఝాన్సీ కవిత అనే డాన్సర్లు కూడా ఈ షో ద్వారా పాపులర్ అయ్యి ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇలా ఎంతోమంది ఈ షో ద్వారా పాపులర్ అయ్యి అవకాశాలు అందుకుంటున్నారు. అయితే ఇలా టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు కల్పించి వారికి గుర్తింపునిచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ షో మూడేళ్ల వయసులో తల్లిదండ్రులకు దూరమైన ఒక బిడ్డను ఇప్పుడు తల్లిదండ్రుల చెంతకు చేరేలా చేసింది.

అసలు విషయం ఏమిటంటే… మూడు సంవత్సరాల వయసున్న చిన్నారి సింధుని ఒక గుర్తు తెలియని మహిళ అపహరించి ఆ బిడ్డకి తల్లిదండ్రులను దూరం చేసింది. మూడేళ్ల వయసులో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ చిన్నారి చెరిష్‌ అనాధాశ్రమం చెంతకు చేరింది. ఇన్నాళుగా అనాధాశ్రమంలో ఉంటూ సింధూ అక్కడే చదువుకుంటోంది . అయితే కొంతకాలం క్రితం అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ సిబ్బంది అనాధాశ్రమంలోని కొంతమంది చిన్నారులను శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు తీసుకొచ్చారు. చిన్నతనంలో తప్పిపోయిన పిల్లలు, తల్లిదండ్రులు భారం అనుకుని వదిలేసిన పిల్లలు ఆ షోలో ఆడిపాడి ఆనందంగా గడిపారు.

ఈ ఏడాది జూన్‌ 19న టెలికాస్ట్‌ అయిన ‘నాన్న నా హీరో’ షోలో కనిపించిన సింధు అనే బాలికను తన తల్లి అనురాధ గుర్తించింది. దీంతో స్నేహితుల సహకారంతో ఆశ్రమం వివరాలు తెలుసుకుని కన్న కూతురి వద్దకు చేరి తానే తల్లిని చెప్పింది. అయితే చిన్నతనంలోనే తల్లి తండ్రులకు దూరమైన సింధూ తన తల్లిని గుర్తించలేకపోయింది. దీంతో సింధు చిన్ననాటి ఫోటోలు చూపించి కన్న బిడ్డను దగ్గరికి తీసుకుంది. ఇలా 8 ఏళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న చిన్నారి శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా తల్లిదండ్రుల వద్దకు చేరింది. తాజాగా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో పాల్గొన్న సింధు తల్లి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.