వంటలక్కను బాగా వాడేశారు.. ‘జాతర’ సూపర్ హిట్ అయ్యేలానే ఉంది!

మామూలుగా బుల్లితెరపై పండుగ వాతావరణం ఒకప్పుడు ప్రశాంతంగా ఉండేది. పూజలు పునస్కరాలు అంటూ భక్తి శ్రద్దలతో కానిచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పండుగ అంటే అందర్నీ నవ్వించడమే. అందర్నీ ఎంటర్టైన్ చేయడమే. ఈ దసరాకు బుల్లితెరపై టగ్ ఆఫ్ వార్ జరగబోతోన్నట్టు కనిపిస్తోంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని తీవ్రమైన పోటీ పడుతున్నారు. అందుకే తమ తమ ఈవెంట్లకు సంబంధించి ప్రోమోలతో దాడి చేస్తున్నారు.

Premi Viswanth And Nirupam Special Attraction For Jatharo Jathara,
Premi Viswanth And Nirupam Special Attraction For Jatharo Jathara,

ఈటీవీ దసరా ఈవెంట్‌లో అక్కా ఎవరే అతగాడు అంటూ సంగీతను పట్టుకొచ్చారు. శ్రీముఖి ప్రదీప్ పెళ్లి అంటూ పాత కాన్సెప్ట్‌నే ఇలా కొత్తవారిపై ప్రయోగిస్తోంది జీ తెలుగు. ఇక స్టార్ మా తన సీరియల్ పరివారంతో రచ్చ చేసేందుకు రెడీ అయింది. ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా వంటలక్క, డాక్టర్ బాబును తీసుకొచ్చారు. మామూలుగా వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ బయట ఈవెంట్లలో ఎక్కడా కూడా కనబడదు.

Premi Viswanth And Nirupam Special Attraction For Jatharo Jathara,
Premi Viswanth And Nirupam Special Attraction For Jatharo Jathara,

కానీ మొదటిసారిగా ప్రేమీ విశ్వనాథ్ జాతరో జాతర అనే ఈవెంట్‌లోకి వచ్చింది. అమ్మవారిగా కనిపించింది. ఇక స్కిట్స్‌, ఆటల్లోనూ వంటలక్క క్రేజ్‌ను బాగానే వాడేశారు. అలా డాక్టర్ బాబును, వంటలక్కను కలిపేసి చూపించారు. చివరకు గంగవ్వ నోటి నుంచి వంటలక్క జపమే వినిపించింది. ఇలా మొత్తానికి వంటలక్క క్రేజ్ పుల్లుగా వాడేశారు. చూస్తుంటే ఈ ఈవెంట్ హిట్ అయ్యేలానే ఉంది.