కొడుకు గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన ప్రభాకర్..? ఫ్రీ పబ్లిసిటీ అయింది అంటూ కామెంట్స్..!

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన నటుడు ప్రభాకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ లో నటిస్తూ నటుడిగా గుర్తింపు పొందటమే కాకుండా నిర్మాతగా మారి సీరియల్స్ ని కూడా నిర్మిస్తున్నాడు. ఇలా బుల్లితెర వల్ల వచ్చిన గుర్తింపుతో వెండితెర ప్రముఖులతో కూడా ప్రభాకర్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన కొడుకు చంద్రహాస్ ని హీరోగా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో చంద్రహాస్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. స్టార్ హీరోల కొడుకుల కూడా ఎంత ఆటిట్యూడ్ చూపించరంటూ చంద్రహాస్ నీ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక తన కొడుకు గురించి వస్తున్న ట్రోల్స్ పై ప్రభాకర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు
ఇక కొడుకు గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన ప్రభాకర్ మాట్లాడుతూ..

ఇలా నా కొడుకుని ట్రోల్ చేయటం కూడా ఒకరకంగా మంచిదే ఎందుకంటే ఇప్పుడు చంద్రహాస్ కి ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. అది మంచైనా, చెడైనా కూడా ఫ్రీగా పబ్లిసిటీ వస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రభాకర్ స్పందించిన తీరు చూసి నెటిజెన్లు అయోమయంలో పడ్డారు. ఇక చంద్రహాస్ కి సంబంధించిన పాత వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.