జబర్దస్త్ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు కమెడియన్ పంచ్ ప్రసాద్. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులతో అందరిని సందడి చేస్తున్నటువంటి ఈయన కిడ్నీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే గతంలో ఒకసారి ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జబర్దస్త్ జడ్జిలు అలాగే ఇతర కమెడియన్లు తనకు ఆర్థిక సహాయం చేసి సర్జరీ చేయించారు. ఇలా సర్జరీ అనంతరం కోలుకున్నటువంటి ఈయన తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సంపాదించినది మొత్తం వైద్య పరీక్షల కోసం భారీగా ఖర్చు చేశారు.ఇప్పుడిప్పుడే అంత కుదుటపడుతుంది అనుకునే క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించింది. ఈ క్రమంలోనే ఈయన జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ప్రతిరోజు డయాలసిస్ చేయించుకుంటూనే ఈయన చికిత్స తీసుకుంటూ ఉండగా ఉన్నఫలంగా మోకాలు నొప్పి రావడంతో హాస్పిటల్లో చేరినప్పటికీ ఈయన నొప్పికి గల కారణం మాత్రం తెలియడం లేదు. ఈ క్రమంలోనే ఒక కాళ్లు మొత్తం చచ్చుబడటంతో కనీసం నడవలేని స్థితిలో ఈయన ఉండటం చూసినటువంటి అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈయనకు కొందరు ఆర్థిక సహాయం చేస్తూ తనకు అండగా నిలబడుతున్నారు అయితే తన భర్తకు సేవలు చేస్తూ తన భార్య పిల్లల దీన పరిస్థితి చూస్తే మాత్రం కన్నీలాగవని చెప్పాలి. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది జబర్దస్త్ అభిమానులు తొందరగా ప్రసాద్ కోలుకోవాలని ఆయన క్షేమంగా తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించాలని కోరుకుంటున్నారు.