రేవంత్ ను నామినేట్ చేసిన బయటకు వెళ్ళడు.. టాప్ ఫైవ్ ఫిక్స్.. శ్రీ సత్య కామెంట్స్ వైరల్?

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆరు వారాలను పూర్తి చేసుకొని ఏడవ వారంలో కొనసాగుతుంది. ఇక ఏడవ వారంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద ఎత్తున గొడవలు పోట్లాటలు జరుగుతున్నాయి. ఇక ఈవారం నామినేషన్స్ లో భాగంగా ఏకంగా 13 మంది కంటెస్టెంట్ లో నామినేషన్ లో ఉండగా వీరిలో ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠత ఏర్పడింది. ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్లను రెండు టీములుగా విభజించారు. అయితే ఈ టీంకు శ్రీ సత్య లీడర్ గా కొనసాగారు.

ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చే బొమ్మలు పువ్వులను ఎవరు ఎక్కువగా కలెక్ట్ చేసి పెట్టుకుంటారో వాళ్లు విన్ అయినట్లు అంటూ టాస్క్ ఇచ్చారు.ఇక ఈ టాస్కులు భాగంగా శ్రీహాన్ చేతిలో ఉన్నటువంటి బొమ్మను శ్రీ సత్య లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే శ్రీ సత్య కింద పడుతుంది.ఇక రేవంత్ ఏం చేసినా శ్రీ సత్య పాయింట్ అవుట్ చేస్తూ ఉండడంతో వెంటనే రేవంత్ సహనం కోల్పోయే శ్రీ సత్య పై ఫైర్ అయ్యారు. ఇదే అదునుగా భావించిన అర్జున్ శ్రీ సత్య కు ఒక ఉచిత సలహా ఇచ్చాడు.

ఈ క్రమంలోనే అర్జున్ శ్రీ సత్యతో మాట్లాడుతూ ఈ పాయింట్ తోనే రేవంత్ ను నామినేట్ చేయి అంటూ సలహా ఇచ్చారు. అయితే ఈ మాట విన శ్రీ సత్య రేవంత్ ను నామినేట్ చేసిన వేస్ట్ అతను బయటకు వెళ్ళడు. ఆయన టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా ఫిక్స్ అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య పెద్ద ఎత్తున గొడవ కూడా చోటు చేసుకుంది.