ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ రోజుకి చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ 6 ప్రారంభమైన మొదట్లో కొంచెం ఆసక్తికరంగా లేకపోయినా కూడా కొంతకాలంగా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న నామినేషన్లు ఎలిమినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా జరిగిన పదవ వారం ఎలిమినేషన్స్ లో అనూహ్యంగా ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ పదవ వారంలో బాలాదిత్య, వాసంతి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన వాసంతి బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలోయాంకర్ శివ అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగేలా సమాధానాలు ఇచ్చింది.
వాసంతి వచ్చీ రాగానే అందంలో బుట్టబొమ్మ.. ఆటలో ఉత్త బొమ్మ అంటూ ఆమె పరువుతీశాడు . ఎలిమినేషన్ అయ్యానన్న బాధ కొంచం కూడా కనిపించటం లేదు అని శివ అనగానే.. ముఖం మీద కనిపిస్తేనే బాధ అని కాదు.. లోపల కూడా ఉంటది అని రిప్లై ఇచ్చింది. వాసంతి మేకప్ వేసుకుని, నీట్‌గా రెడీ అవ్వడం తప్పా గేమ్ మాత్రం ఆడలేదు అని శివ అనగానే.. బిగ్ బాస్ హౌస్ లో చేయాల్సినవన్ని చేశాను అంటూ వాసంతి సమధానం చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు చాలా అల్లరి చేస్తాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని అన్నావ్.. ఏం ఎంటర్టైన్ చేశావ్.. ఏం అల్లరి చేశావ్ అని శివ అడగ్గానే… ఏం చేయకపోతే జనాలకు నచ్చకపోతే ఇన్ని రోజులు ఉండేదాన్ని కాదు అంటూ గట్టిగా సమధానం ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు నెట్టుకొస్తానని అనుకున్నావా? అని శివ అడిగిన ప్రశ్నకు .. ఉంటానని అనుకున్నాను.. ఇంకా ఉంటానని కూడా అనుకున్నా అంటూ సమాధానం ఇచ్చింది. నీకు నువ్వు వందుకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావ్ అని అడిగితే.. డెబ్బై అని సమాధానం చెబుతుంది . వంద ఇచ్చుకోలేరా? అని శివ ఎదురు ప్రశ్న వేయగానే.. నాకు కాన్ఫిడెన్స్ ఉంది.. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వారం మొత్తం సైలెంట్ గా ఉండే నువ్వు నామినేషన్లో మాత్రమే ఎందుకు కోపంగా ఉంటావ్.. అని శివ అడగగానే… ఇనయలాగా ప్రతీ దాంట్లో దూరమంటావా? అని రివర్స్ లో ప్రశ్న అడుగుతుంది. బిగ్ బాస్ షోకు ఎందుకు వచ్చారు అని అడిగితే.. ఫేమ్ కోసం అని చెబుతుంది . మీకు అది వచ్చిందని అనుకుంటున్నారా? అని శివ అడిగితే.. ఏమో అన్నట్టుగా వాసంతి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.