బిగ్‌హౌస్‌కి నయా గ్లామర్: ఆ ఇద్దరిలో ఎవరు.?

మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ అయిన బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఇప్పటికి మూడు ఎలిమినేషన్లు జరగ్గా 16 మంది కంటెస్టెంట్లున్నారు. ఈ వారం ఎనిమిది మంది ఎలిమినేషన్‌లో ఉన్నారు. కాగా, త్వరలోనే ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది.

దాంతో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ఆ నయా కంటెస్టెంట్ వీరే అంటూ గుసగుసలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ ది డ్రాగన్ అంటూ హౌస్‌లోకి రాబోయే ఆ కంటెస్టెంట్ ఎవరంటే.. బుల్లితెర ముద్దుగుమ్మ వర్షిణి అంటూ కొందరు, కాదు కాదు, హాట్ బ్యూటీ విష్ణు ప్రియ అంటూ ఇంకొందరు అంటున్నారు.

అసలు బిగ్‌బాస్ స్టార్టింగ్‌లోనే వర్షిణి ఎంట్రీ ఉంటుందనుకున్నారంతా. కానీ, అలా జరగలేదు. అయినా బుల్లితెరపై వర్షిణి కనిపించి చాలా కాలమే అయిపోయింది. బిగ్‌బాస్ షో కోసమే వర్షిణి హైడ్ అయిపోయిందనుకున్నారంతా. కానీ, షో స్టార్ట్ అయ్యి మూడు వారాలు గడుస్తున్నా వర్షిణి విషయంలో క్లారిటీ రాలేదు.

కొత్తగా విష్ణు ప్రియ పేరు తెర పైకి వచ్చింది. అసలింతకీ వీరిద్దరిలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేదెవరు.? ఇద్దరినీ బిగ్‌బాస్ హోల్డ్ చేసి పెట్టాడనేది మరో టాక్. ఏది ఏమైనా ఐదో వారానికల్లా ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతోందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ ఇద్దరిలో ఎవరు బిగ్ హౌస్‌లో సందడి చేయనున్నారో. ఇద్దరిలో ఎవరైనా బిగ్‌బాస్‌కి నయా గ్లామర్ అద్దడం మాత్రం పక్కా.