నిజం చెప్పబోయిన మోనిత…. మెడ పట్టి బయటకు గెంటిన దీప…. సందేహం వ్యక్తం చేస్తున్న అనసూయ!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే సౌందర్య పిల్లలతో పాటు కార్తీక్ దీపను తీసుకుని వారు ఉంటున్న ఇంటికి వెళ్తుంది అయితే అక్కడ మోనిత దోసెలు తినడం చూసి షాక్ అవుతుంది.నువ్వేంటి ఇక్కడ అని ప్రశ్నించగా ఓకే అందరూ కలిసిపోయారా అంటూ మాట్లాడుతున్నప్పటికీ సౌందర్య మాత్రం ఆవేశంతో ఊగిపోయిన జుట్టు లాగుతుంది.జుట్టు వదలండి ఆంటీ ఇప్పటికే మీ అబ్బాయి నా వంక చూడలేదు మరి జుట్టు పోతే అసలే చూడడు అంటూ సెటైర్ వేస్తుంది.ఇన్ని రోజులు దీపా కార్తీక్ నా దగ్గరకు రాకపోవడానికి నువ్వే కారణమా అని అడగడంతో జైలుకు వెళ్లకు ముందు వరకు నేనే కారణం జైలుకు వెళ్లిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అయితే ఇన్ని రోజులు వీళ్ళు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పాలి కదా అంటూ మోనిత నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ఇలా ఆమె దీప మరెన్నో రోజులు బతకదని చెప్పే ప్రయత్నం చేస్తుండగా కార్తీక్ దీపను అడ్డుకొని తనని మెడబట్టి బయటకు దొబ్బుతారు.సౌందర్య మాత్రం అదేదో చెప్పబోతోంది మీరు మాత్రం ఏమీ లేదు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అంటూ కోప్పడుతుంది. మోనిత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పుడే లగేజ్ సర్దమని చెప్పి తన ఇంటికి తీసుకు వెళుతుంది. మరోవైపు టీపాయ్ పగలగొట్టడంతో మోనిత చేతికి దెబ్బ తగులుతుంది చారుశీల ట్రీట్మెంట్ ఇస్తుంది.

ఇక సౌందర్య ఇంటికి వెళ్లిన కార్తీక్ పిల్లలతో కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు కానీ సౌందర్య మాత్రం అసలేం జరిగింది మీరు మాత్రం ఏమీ లేదని నా దగ్గర ఏదో దాస్తున్నారు అని మాట్లాడుతుంది.అంతలోపే దీప కూడా అక్కడికి భోజనం తీసుకురావడంతో వీరిద్దరూ సైగలు చేసుకుంటూ ఉంటారు. కానీసౌందర్య మాత్రం వీరిద్దరిని గమనిస్తూనే వీరు నా దగ్గర ఏదో దాచి పెడుతున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ అనుకుంటుంది.

మరోవైపు చారుశీల మోనితఇద్దరు మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి కార్తీక్ ను నేను దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటివరకు కార్తీక్ నుదక్కించుకోలేకపోయాను అని మాట్లాడుతుంది. ముందు నువ్వు కార్తీక్ మనసులో మంచిదానిలా చోటు సంపాదించు అప్పుడే కార్తీక్ నీ వెంట పడతాడని చారుశీల సలహా ఇస్తుంది. కార్తీక్ ఒక్కడే ఉన్నప్పుడే తనని దక్కించుకోలేకపోయాను ఇప్పుడు అందరూ ఒకటయ్యారు. నిన్నైనా వాడుకుందామని చూస్తే నీ గురించి నిజం చెప్పేసానని మోనిత చెప్పడంతో అప్పుడే నిజం ఎవరు చెప్పమన్నారు అని చారుశీల అనడంతో చెప్పకపోతే కార్తీక్ నువ్వు ఎగరేసుకు పోదామని ఆలోచిస్తున్నావా అంటూ షాక్ ఇస్తుంది.

మరోవైపు కార్తీక్ దీప మాట్లాడుకుంటూ అసలు అమ్మ వాళ్లకి నువ్వు ఎందుకు కనిపించావు దీప అని అడగడంతో బంధాలు వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారు…అమ్మ వాళ్లకు కనిపించకుండా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్లిపోయే వాళ్ళం కదా అని మాట్లాడుతూ ఉంటారు.అయితే వీరిని గమనించిన సౌందర్య వీళ్ళు నాకు తెలియకుండా ఏదో నిజం దాస్తున్నారు. అది తెలుసుకోవాలంటే వీళ్ళని అడిగితే చెప్పరు చాటుగా వింటేనే తెలుస్తుంది అని పక్కకు వెళ్ళగా అది గమనించిన దీప మాట మారుస్తుంది. కార్తీక్ కూడా ఈ విషయాన్ని గమనించి టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు.