దుర్గను అరెస్టు చేయించిన మోనిత… సౌర్య కోసం సంగారెడ్డి వెళ్లిన కార్తీక్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇకపోతే గత ఎపిసోడ్లో భాగంగా దీప తన కూతురి కోసం సంగారెడ్డి వెళ్లి వెతుకుతున్న సంగతి తెలిసిందే. అయితే మోనిత ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని కనుక్కొని పనిలో కార్తీక్ నిమగ్నమయ్యారు. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా హిమ చదువుకుంటూ ఉండగా సౌందర్య ఆనందరావు అక్కడికి వచ్చి నువ్వు బాగా చదువుకొని మీ నాన్న లాగా గొప్ప డాక్టర్ కావాలని చెబుతారు. అప్పుడు నేను నాన్న లాగా డాక్టర్ అవుతా శౌర్య కలెక్టర్ కావాలి మరి తమ్ముడు ఏమవుతాడో అంటూ హిమ అంటుంది. ఆ మాటలకు ఆనంద్ రావు వాడు చిన్నోడు కదా వాడు పెద్దయ్యాక వాడేమైతే అదే చేపిద్దాం అంటూ చెప్పుకొచ్చాడు.

హిమ ఆనంద్ నీ తీసుకొని బయటకు వెళ్లి ఆడుకోగా.. సౌందర్య దీప కార్తీక్ ఫోటో వద్దకు వెళ్లి మోనిత చేసిన అరాచకాలని గుర్తు చేసుకుంటూ ఎలాగైనా అక్కడికి వెళ్లాలి అనుకుంటుంది. మరోవైపు మోనిత దుర్గకు ఫోన్ చేసి మరి కాసేపట్లో నువ్వు వెళ్ళిపోతావు అంటూ వార్నింగ్ ఇవ్వగా పగటి కలలు బంగారం అంటూ సెటైర్స్ వేస్తాడు. ఇక ఫోన్లో మోనిత దుర్గను రెచ్చగొట్టి ఫలానా చోటుకు రమ్మని లొకేషన్ పంపుతుంది.అక్కడికి వెళ్లిన దుర్గ ఏదో పదిమంది గ్యాంగ్ తో ఉన్నావు అనుకున్న సింగిల్ గా ఉన్నావేంటి బంగారం అంటూ అనగా నిన్ను ఎక్కువ సేపు బయట ఉంచితే ప్రమాదం అందుకే లోపలికి పంపిస్తున్న అంటూ వార్నింగ్ ఇస్తుంది. కాసేపటికి పోలీసులు వచ్చి దుర్గను అరెస్టు చేసి తీసుకెళ్లడంతో మోనిత దుర్గ గాడి పీడ విరగడయింది అంటూ సంతోషపడుతుంది.

మోనితను ఫాలో అవుతున్న కార్తీక్ షాపింగ్ అని చెప్పి దుర్గను పోలీసులకు అరెస్టు చేయించావా అంటూ అక్కడి నుంచి దీప సంగారెడ్డి లో ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ సంగారెడ్డి వెళ్తాడు. మరోవైపు సౌందర్య మోనిత దగ్గరకు సిద్ధమవుతూ ఉండగా హిమ నేను కూడా వస్తానంటూ మొండి చేస్తుంది.ఇక ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే శివ వచ్చి దీపక్క ఫోన్ చేస్తే కార్తీక్ సార్ వెళ్ళాడు అంటూ చెప్పగా
మోనిత కంగారు పడుతుంది.

ఒకవేళ కార్తీక్ కిసౌర్య కనిపించి నాన్న అని పిలిస్తే తనకు గతం గుర్తుకొస్తుంది ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది.మరోవైపు దీపా కార్తీక్, సౌర్య కోసం సంగారెడ్డి వెతుకుతూ ఉండగా మరోవైపు ఆనందరావు సౌందర్య కూడా సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇలా దీప కార్తీక్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మరోసారి దీపకళ్ళు తిరిగి పడిపోతుంది.ఈ బాధలు భరించే కన్నా చనిపోవడం మేలు డాక్టర్ బాబు అంటూ దీప బాధపడగా అలా మాట్లాడకు వంటలక్కఅని దీపకు ధైర్యం చెబుతాడు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.