హిమను కిడ్నాప్ చేసిన మోనిత…. అసలు విషయం చెప్పిన వారణాసి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే…. దీప మోనితను బజారుకీడ్చి నలుగురు ముందు తనని అవమాన పరుస్తుంది. పోయేదానివి కార్తీక్ ను నా చేతిలో పెట్టి వెళ్ళకుండా ఈ శపతాలేంటి అంటూ మోనిత మాట్లాడగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాంటి ఆలోచన నీ మనసులో నుంచి తీసేయ్ అంటూ చెబుతుంది.అంటే నువ్వు చనిపోయే లోపే కార్తీక్ రెండో పెళ్లి చేసి చనిపోతావా అని మోనిత అనగా నిన్నే కార్తీక్ తో కలిసి కాపురం చేయనివ్వలేదు ఇంకొకటి వస్తే నేను చూస్తూ ఊరికే ఉంటాను అంటూ మోనిత మాట్లాడుతుంది.ఇక ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరగడంతో దీప ఇప్పుడు బజారులో కళ్ళు తెరిచావు ఇలాగే చేస్తే నరకంలో కళ్ళు తెరుస్తావ్ అంటూ తనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.

ఇక దీప ఇంటికి రావడంతో సౌందర్య ఎక్కడికి వెళ్లావు దీపా రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అంటే మోనిత దగ్గరకు వెళ్లి తాడోపేడో తేల్చుకున్నాను అంటూ దీప సమాధానం చెబుతుంది అంతలోపు భాగ్యం అక్కడికి వస్తుంది. దీప శౌర్య హిమ ఎక్కడికి వెళ్లారు అనడంతో శౌర్య ఎక్కడుందో తెలియదు కానీ హిమ బయటకు వెళ్ళింది అని సమాధానం చెబుతుంది. అవును నేను లోపలికి వచ్చేటప్పుడు హిమ నా ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి అడ్రస్ చెప్పమని అడిగింది అనడంతో సౌందర్య కంగారు పడి అదే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయడంతో మోనిత అని రావడంతో షాక్ అవుతారు. అయితే అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో దీప కార్తీక్ సౌందర్య కంగారు పడతారు.

ఆ మోనిత ప్రపోజల్ కు మనం ఒప్పుకోలేదని చివరికి హిమను అడ్డుపెట్టుకొని తనని కిడ్నాప్ చేసింది అంటూ దీప కంగారుపడుతుంది వెంటనే దీప కార్తీక్ సౌందర్య మోనిత ఇంటికి వెళ్ళగా అక్కడ టూ లెట్ అనే బోర్డు ఉంటుంది.ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చి దాంతో గొడవ పడ్డాను అప్పటికప్పుడే ఇల్లు ఎలా ఖాళీ చేసి వెళ్ళింది డాక్టర్ బాబు అది చివరికి అనుకున్నంత పనిచేసేలాగా ఉంది అంటూ దీప మాట్లాడటంతో నేను సచ్చినా తన ప్రపోజల్ కి ఒప్పుకోనని కార్తీక్ మాట్లాడుతాడు. అయితే ఇదంతా లోపల ఉన్నటువంటి మోనిత హిమ వింటూ చూసావా హిమ మీ నాన్నకు నేను చెప్పిన ప్రపోజల్ ఒప్పుకోలేదు మీ అమ్మ ప్రాణాలు పోవడమే మీ నాన్నకు ఇష్టం అంటూ తనని రెచ్చగొడుతుంది.

ఇక దీప కంగారు పడుతూ ఉండగా దీప నువ్వేం టెన్షన్ పడకు అది ఎక్కడున్నా జుట్టు పట్టుకు లాక్కు వస్తాను అది హిమను ఏమి చేయలేదు అంటూ సౌందర్య దీపను ఓదారుస్తుంది. ఇక అందరూ అక్కడి నుంచి హిమను వెతకడం కోసం వెళ్ళిపోతారు. సౌందర్య మోనిత గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని చెబుతుంది. అయితే ఇవన్నీ విన్నటువంటి హిమ ఆంటీ నాకు భయంగా ఉంది అనడంతో భయపడేలా ఉంటే ఇప్పుడే వెళ్లిపో… నీకు మీ అమ్మ ప్రాణాలు ముఖ్యం కాదా అని తనని బ్లాక్మెయిల్ చేస్తుంది. మోనిత ఫోన్ ట్రై చేస్తూ ఉండగా తాను లిఫ్ట్ చేయడంతో హిమ నా చేతిలోనే భద్రంగా ఉంది నా ప్రపోజల్ కి ఒప్పుకో అంటూ తనని మరోసారి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇక నేను చచ్చే లోపు దానిని కూడా నా వెంటే తీసుకెళ్తానని దీప మాట్లాడటంతో హిమ నా చేతుల్లో ఉందని గుర్తుపెట్టుకో అంటూ మోనిత బెదిరిస్తుంది.ఇలా అందరూ హిమను తీసుకొని అది ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉండగా అంతలోపు వారణాసి వచ్చి దీపక్క నువ్వు అనుమానించినది కరెక్ట్ అయింది ఆ మోనిత హిమతోపాటు ఆ ఇంటి లోపలే ఉంది అంటూ అసలు విషయం బయట పెడతారు.