హిమను అడ్డుపెట్టుకొని కార్తీక్ ను సొంతం చేసుకునే పనిలో మోనిత….. మోనిత బ్రతుకు బజారుకీడ్చిన దీప!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…మోనితను కలిసిన తర్వాత హిమా ఆటోలో ఇంటికి వెళుతుంది. వెళుతూ మోనిత ఆంటీచెప్పినట్టు డాడ్ ఎందుకు చేయడం లేదు నాన్నకు అమ్మను బ్రతికించుకోవడం ఇష్టం లేదా అమ్మ అంటే ఇష్టం లేదా అని ఆలోచిస్తూ వెళ్తుండగా గుడి దగ్గర కార్తీక్ వాళ్ళ కారు ఆగి ఉండడం చూసి హిమ కూడా అక్కడే దిగుతుంది.దీప ఏదో ఆలోచిస్తూ కూర్చుండగా కార్తీక్ అక్కడికి వచ్చి పూజారికి అంతా చెప్పవా దీప అనడంతో చెప్పాను ఏమన్నారు అంటే దేవుడే వరం ఇవ్వనప్పుడు పూజారి ఏం చేస్తాడు అని దీప మాట్లాడుతుంది. అంతలోపే దీపకు నొప్పి రావడంతో కార్తీక్ తనకు టాబ్లెట్ వేసి తనని కారులో కూర్చోబెట్టు శౌర్య ముడుపు కట్టడానికి వెళ్ళింది వెంటనే మనం వెళ్దాము అని చెబుతుంది అయితే అక్కడికి వచ్చిన హిమ తన తండ్రిని పక్కకు తీసుకువెళ్తుంది.

ఇలా పక్కకు వెళ్లి నాకు మోనిత ఆంటీ మొత్తం చెప్పింది డాడీ అమ్మ మరి కొద్ది రోజులే బ్రతుకుతుందని నాకు తెలుసు అమ్మ బ్రతకాలంటే మీరు మోనిత ఆంటీ చెప్పినట్టు చేయండి అలా చేస్తానని నాకు మాట ఇవ్వండి అంటూ నిలదీస్తుంది. దాంతో కార్తీక్ ఈ రాక్షసి అమ్మకు చెప్పిందే కాకుండా పిల్లలకు చెప్పి బాధపెడుతోందాఅనుకొని అవి చెప్పేవన్నీ అబద్ధాలే నువ్వు ఏమి పట్టించుకోకు అని కార్తీక్ చెప్పినప్పటికీ మీకు అమ్మంటే ఇష్టం లేదు మీరు మారలేదు అంటూ హిమ మాట్లాడుతుంది.

మరోవైపు దీప నేను ఇంకా కొద్దిరోజులే బ్రతుకుతాను. ఎలాగైనా డాక్టర్ బాబును ఒప్పించాలి అనుకుంటూ ఉండగా అంతలోపు సౌందర్యం వస్తుంది మామయ్య గారికి ఎలా ఉంది అత్తయ్య అనడంతో ఒక వారం రోజుల్లో డిస్చార్జ్ చేస్తారని చెప్పారు వారం రోజులు వరకు నేను ఉంటాను లేదో మిమ్మల్ని అందరిని బాగా చూసుకోవాలి అంటూ ఉండగా శౌర్య వచ్చి ఎక్కడికి వెళ్తావు అమ్మ మరి అని ప్రశ్నిస్తుంది దాంతో ఏమీ లేదని చెప్పి సౌర్యను వంట చేయడం కోసం తీసుకువెళ్తుంది. మరోవైపు హిమ సౌందర్య దగ్గరకు వెళ్లి జరిగినది మొత్తం చెబితే.సౌందర్య దాని మాటలు పట్టించుకోకు అది అలాగే చెబుతుంటుంది అని నచ్చదు దాంతో మీకు కూడా అమ్మను బ్రతికించాలని ఇష్టం లేదు కదా నాన్నమ్మ అంటుంది.

ఇక దీప ఏంటి అత్తయ్య అని అడగడంతో ఏమీ లేదని సౌందర్య చెప్పినప్పటికీ నేను మొత్తం విన్నాను. ఆ మోనిత సంగతి చెబుతానంటూ అక్కడికి బయలుదేరుతుంది.అయితే మోనిత నిద్రలేచేసరికి తన మంచం రోడ్డుపై ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరునా మంచం ఇక్కడికి తీసుకు వచ్చింది అనడంతో నేనే అంటూ దీప షాక్ ఇస్తుంది.నేను పోతే నువ్వు కార్తీక్ బాబు సొంతం కావాలని నీ మెడలో తాళి కట్టే వరకు నాకు గుండె ఇవ్వవా… ఎంత స్వార్థ బుద్ధి నీది అనడంతో ఇందులో తప్పేముంది అని మాట్లాడుతుంది వెంటనే వారణాసి దీపమ్మా ఈమెను మాత్రం నమ్మకండి అంటూ మాట్లాడతారు అనంతరం దీప నడిరోడ్డులో మోనిత గురించి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుంచి పెళ్లయిన నా మొగుడి కోసం వెంటపడుతుంది పిల్లలు ఉన్నా కూడా నా మొగుడిని వదిలిపెట్టలేదు అంటూ అందరి ముందు తనని అవమానపరచడంతో కాలనీవాసులు కూడా తనని అవమానిస్తారు. దీంతో
మోనిత పోయేదానివి పోకుండా నన్ను రెచ్చగొట్టావు కదా నీ అంత చూస్తా అంటూ శపథం చేస్తుంది.