భానూర్ లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ట్రైనింగ్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఏకంగా 117 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం. ఫిట్టర్స్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్, సీఓపీఏ, కార్పెంటర్, ప్లంబర్, ఎల్.ఏ.సీ.పీ, ఆర్ అండ్ ఏసీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
2024 సంవత్సరం అక్టోబర్ 31 నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ కోసం అర్హత ఉన్నవాళ్లకు ఏడాది శిక్షణ ఉంటుంది. విద్యార్హతలలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఏడాది నవంబర్ 11 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.