పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన మల్లిక… జానకి చదువు విషయంలో సవాల్ చేసిన రామా!

స్టార్ మా లో ప్రసారమౌతూ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన జానకి కలగనలేదు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబ విలువలను తెలియజేస్తూ ప్రసారమవుతున్నటువంటి ఈ సీరియల్ ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకోవడమే కాకుండా అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకుని దూసుకుపోతోంది.ఇకపోతే ఈరోజు ఎపిసోడ్లో భాగంగా జానకి తన చదువు మానేసిన విషయాన్ని తెలుసుకున్నటువంటి మల్లికా సంతోషంలో చిందులు వేస్తుంది.రామ ఎంత చెప్పినా జానకి చదువుకోవడానికి ఇష్టపడకపోవడమే కాకుండా తాను ఇంటి కోడలుగా తనకు భార్యగా ఉంటానని తేల్చి చెబుతుంది.

ఇలా రామ చెప్పినప్పటికీ జానకి వినకపోవడంతో రెండు రోజుల్లో మీ మనసు మార్చి తిరిగి మిమ్మల్ని కాలేజీకి వెళ్లేలా చేస్తాను ఇలా చేయకపోతే నేను రామచంద్రనే కాదు అంటూ శపథం చేస్తారు.ఈ విధంగా జానకి కాలేజీకి వెళ్లలేదని తెలుసుకున్న మల్లికా సంతోషంలో చిందులు వేస్తూ ఉంటుంది. ఇక మల్లికా చిందులు వేస్తూ కింద పడగా ఒక్కసారిగా తనపై దీపపుకుందే పడబోతుండడంతో వెంటనే జ్ఞానంబ పట్టుకుంటుంది. జ్ఞానంబ ఇలా పట్టుకోవడంతో మల్లిక నాకు చివాట్లు తప్పవని గ్రహించి తన కాలు విరిగినట్టు గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకు ఇంట్లో ఉన్న వారందరూ వస్తారు.

నువ్వు ఒకచోట కుదురుగా ఉండవు ఎన్నిసార్లు చెప్పాను నీకు కాస్త నెమ్మదిగా ఉండమని అసలే ఒట్టి మనిషివి కూడా కాదు కడుపుతో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదా ఒక్క నిమిషం నేను రావడం ఆలస్యమై ఉంటే ఈ దీపపు కుందే నీ మీద పడి ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అంటూ జ్ఞానంబ తిడుతుంది. జానకి మల్లికను లోపలికి తీసుకెళ్లగా ఇక నీ నాటకాలు ఆపు చాలు అత్తయ్య నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా కాలు విరిగినట్లు నటిస్తున్నావని నాకు తెలుసు అంటూ జానకి తిడుతుంది.ఇక నాకు కడుపు లేదని తెలిసిన ఇంట్లో వారికి ఎందుకు చెప్పలేదు అంటూ మల్లిగా అడగగా అది కడుపు ఎక్కువ రోజులు దాగదు నిజం ఎప్పటికైనా తెలిసిపోతుంది. ఆ సమయంలో నువ్వు అత్తయ్యలో భద్రకాళిని చూస్తూ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది.

ఇకపోతే ఇంట్లో ఇలాంటి సంఘటనలన్నీ జరగడంతో శాంతి పూజ చేయించాలని జ్ఞానంబ భావించి పండితులను పిలిపించి ఆ ఏర్పాట్లు అన్నీ చూడమని రామాకు చెబుతుంది.ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు మొత్తం శివాలయానికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయించి శాంతి పూజ చేయిస్తారు.ఇక గుడి ఆవరణంలో జానకిరామ ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అది చూసి మల్లికా కుళ్ళుకుంటుంది. ఇది గమనించిన గోవిందరాజు తనపై యధావిధిగా సెటైర్లు వేస్తారు. పూజ అనంతరం కోనేరులో దీపాలు వెలిగించాలని పండితులు చెప్పడంతో రామా జానకి వెళ్లి దీపాలు వదలడమే కాకుండా తన భార్య ఐపీఎస్ కావాలని రామ కోరుకుంటారు.