రామా జానకిలను నోటికి వచ్చినట్లు మాట్లాడిన మల్లిక… డబ్బు సర్దే ప్రయత్నంలో విష్ణు జెస్సి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్లో ఎంతో ఆసక్తికరంగా మారింది. రామ ఇంటిని కాపాడుకోవడం కోసం ఉన్నటువంటి ఏకైక మార్గం తన స్వీట్ షాప్ తాకట్టు పెట్టడమేనని భావించి ఈ విషయం తన తల్లికి చెప్పాలని వెళ్తాడు అయితే అదే సమయంలోనే మల్లికా అడ్డుపడి ఇంటిని విడిపించుకోవడం కోసం స్వీట్ షాప్ తాకట్టు పెట్టడం మరి దానిని తిరిగి విడిపించుకోవడానికి ఇంటిని తాకట్టు పెట్టడానికా అని అడ్డు పుల్ల వేస్తుంది. జీవనాధారంగా ఉన్నటువంటి షాప్ తాకట్టు పెడితే ఎలా బతికేది అని మల్లికా మాట్లాడుతుంది.

రామా తాను ఎలాంటి పరిస్థితిలలో అప్పు చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి దయచేసి ఈ నిర్ణయానికి అందరూ ఒప్పుకోండి అని చెప్పడంతో మల్లికా తన నిర్ణయాన్ని ఏమాత్రం సమర్పించదు ఇక విష్ణు నువ్వు కాసేపు నోరు మూసుకో అని చెప్పినప్పటికీ మల్లిక మాత్రం తన మాట వినదు. ఇక జెస్సి కూడా రామా జానకికి సపోర్ట్ చేస్తూ మాట్లాడగా అఖిల్ మాత్రం జెస్సి నోరుమూయిస్తాడు. ఇలా స్వీట్ షాప్ తాకట్టు పెట్టడానికి ఎవరు ఒప్పుకోకపోవడంతో రామ నేను కుటుంబం సంతోషం కోసమే 20 లక్షల అప్పు చేశాను కానీ ఎవరు కూడా దానిని గుర్తించలేదు చివరికి అమ్మ కూడా నా మాటలు నమ్మడం లేదని రామ బాధపడతాడు.

దీంతో జానకి కుటుంబం అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు ఇలాంటివి కూడా ఉంటాయని తనకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది.ఇంటి పరువు పోకుండా మన ఇల్లు మనకి ఉండాలి అంటే తప్పనిసరిగా డబ్బు కట్టాలి డబ్బు కోసం ఎలాగైనా ప్రయత్నం చేస్తానని రామ తనకు తెలిసిన వారందరిని డబ్బులు అడుగుతాడు. మరోవైపు విష్ణు తన స్నేహితులకు ఫోన్ చేసి డబ్బు కావాలని అడగడంతో అది విన్న మల్లికా ఒక్కసారిగా విష్ణు పై ఫైర్ అవుతుంది.మీ అన్నయ్య వదిన మనకు తెలియకుండా ఆ 20 లక్షలతో ఫ్లాట్ కొన్నారు ఇప్పుడు మీరు ఆ అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారా అంటూ తిడుతుంది.

మరోవైపు జెస్సి కూడా అఖిల్ తో మాట్లాడుతూ అక్క బావ నీ ఉద్యోగం కోసమే 20 లక్షల అప్పు చేశారు కదా మనం వాళ్లకు సహాయం చేయాలి అని చెప్పడంతో అఖిల్ మాత్రం ఇదంతా వదిన ఆడుతున్న నాటకం వాళ్లు ఆ డబ్బులతో ఏదో ప్రాపర్టీ కొన్నారని చెబుతాడు.ఇంటిని విడిపించుకోవడం కోసం మా నాన్నను డబ్బులు అడుగుతాను అఖిల్ అని జెస్సి చెప్పగా అవసరం లేదంటూ అఖిల్ మాట్లాడతారు.మరోవైపు రామా తనకు అర్జెంటుగా 20 లక్షల కావాలని అడగడంతో ఓ పెద్దాయన తనుకు డబ్బు ఇస్తానని అయితే ఒక అయిదారు రోజుల సమయం కావాలని చెబుతాడు. రామా మాత్రం తనకు అర్జెంటుగా 20 లక్షలు కావాలని తనని ప్రాధేయపడతారు.