Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని నెలల పాటు చిత్ర బృందం మొత్తం న్యూజిలాండ్ లోనే ఉంటూ అక్కడే షూటింగ్ పూర్తిచేసుకుని తిరిగి ఇండియాకి వచ్చారు . ఇలా ఈ సినిమా న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకున్న నేపథ్యంలో మోహన్ బాబు అక్కడ విష్ణు కోసం పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారని తెలుస్తుంది.
ఈ విషయాన్ని ఒక వీడియోలు స్వయంగా మోహన్ బాబు తెలియచేయడం విశేషం. అందమైన ఓ ప్రదేశాన్ని చూపిస్తూ ఈ ప్లేస్ మొత్తం విష్ణు కోసమే తాను కొన్నానని, ఈ బంగ్లా ఆ కొండలు మొత్తం 7000 ఎకరాలు విష్ణు కోసం న్యూజిలాండ్ లో కొనుగోలు చేశాను అంటూ మోహన్ బాబు తెలియచశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియో పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలో సంపాదించిన మొత్తం అక్కడ ఆస్తులుగా కూడా పెడుతున్నారా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు న్యూజిలాండ్ లో భూములు అంత చీపా బ్రో అంటూ కామెంట్లు చేశారు అయితే తాజాగా ఈ విషయంపై మరో నటుడు బ్రహ్మాజీస్ స్పందించారు. జోక్‌గా చేసిన వ్యాఖ్యలను కూడా ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫన్ కోసమే ఆ వీడియోని షేర్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. ‘ సరదా కోసమే ఆ వీడియో చేశాం.
న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నామని మోహన్ బాబు సరదాగా అన్నారు. అక్కడి పర్వతాలు కూడా కొన్నామని జోక్ చేశాడు. కానీ సడెన్‌గా నిజంగానే అక్కడ 7 వేల ఎకరాలు కొన్నారని వార్తలు రాశారు. అరే భాయ్.. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొనడం అంత ఈజీనా? షూటింగ్ కోసం అక్కడి వెళ్లాం అంతే. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. . నాన్ సిటీజెన్స్‌లకు న్యూజిలాండ్‌లో స్థలాలు అమ్మరు. అక్కడి సిటిజన్స్‌కి మాత్రమే స్థలాలు కొనే హక్కు ఉంది. సరదా సంభాషణలను సీరియస్‌గా తీసుకోకండి అంటూ బ్రహ్మాజీ క్లారిటీ ఇచ్చారు.