Manchu Manoj: మంచు వారి కుటుంబంలో జరుగుతున్న గొడవలు సర్దుమనిగినట్టేనా అంటే అవుననే తెలుస్తోంది. తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ చూస్తే మాత్రం అన్నదమ్ములు మధ్య మనస్పర్ధలు తొలగిపోయి కలిసిపోయారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే.. మంచు విష్ణు మోహన్ బాబు ఇటీవల కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విష్ణు కుమార్తెలు కొడుకు అవ్రామ్ కూడా నటించారు. అయితే తన నటనకు గాను సంతోషం ఫిలిమ్స్ అవార్డులో భాగంగా ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే తాజాగా అవ్రామ్ ఈ అవార్డును అందుకున్న నేపథ్యంలో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…”కంగ్రాట్స్ అవ్రామ్.. సో ప్రౌడ్ అఫ్ యు మై బాయ్.. కీప్ షైనింగ్ నాన్న.. అంటూ తన సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఇది మీకు ఎంతో ప్రత్యేకం విష్ణు అన్న, నాన్న మోహన్ బాబు గారికి కూడా అవార్డులు అందుకోవడం ఎంతో ప్రత్యేకం అంటూ సోషల్ మీడియా వేదికగా మనోజ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇలా మంచు విష్ణు తన అన్నయ్య విష్ణు గురించి తన కొడుకు అందుకున్న అవార్డు గురించి ఇలాంటి పోస్ట్ చేయటంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మంచు అభిమానుల సంతోషానికి కారణమవుతుంది. ఇలా అన్నయ్య అంటూ మనోజ్ పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు పూర్తిగా తొలగిపోయాయని వీరిద్దరూ కలిసిపోయారని అభిమానులు భావిస్తున్నారు.ఇలా వీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకున్న అభిమానుల కల నెరవేరిందని చెప్పాలి.
