కుటుంబ విలువలను తెలియజేస్తూ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… అఖిల్ ఎలాగైనా ఉద్యోగం చూసుకోవాలని తన సర్టిఫికెట్ తీసుకొని బయలుదేరుతూ ఉండగా మల్లిగా అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నించింది. ఇదే అదునుగా భావించిన మల్లికా అఖిల్ కు జానకి గురించి లేనిపోనివి చెప్పి తన మనసులో జానకిని చెడు చేస్తాడు.నీలాంటి ఇంత మంచి వాడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు జానకి నీ గురించి అందరికీ చెడుగా చెప్పడం చూసి బాధేసింది అంటూ ముసలి కన్నీళ్లు కారుస్తుంది.
మన్నెవరో జానకి బంధువులు ఇంటికి వస్తే ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తారని చెప్పగా పెద్దన్నయ్య స్వీట్ షాప్ రెండు అన్నయ్య బట్టలు కొట్టు మూడో వాడికి రేపు మాపో బిడ్డ పుడుతున్న బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు అంటూ అందరికీ నీ గురించి చెడుగా చెబుతుంది అంటూ మల్లిక లేనిపోనివి చెబుతుంది.దీంతో అఖిల్ అన్నయ్య ముందే కాకుండా వేరే వాళ్ళ ముందు కూడా వదిన నన్ను చెడ్డ చేస్తుందా అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు.ఏంటి అఖిల్ నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా అని మల్లికా అనడంతో లేదు వదిన అన్నయ్య ముందే నన్ను చెడుగా చేసి మాట్లాడటం విన్నాను బయట వాళ్ల దగ్గర చెప్పదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు రామా జానకిని కాలేజీ దగ్గర దింపి అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉండగా అఖిల్ కు మంచి జాబ్ వస్తుంది మీరు తన గురించి బాధపడకండి అని ధైర్యం చెప్పి కాలేజ్ కి వెళుతుంది. జానకి పుస్తకాలు ముందు వేసుకుని అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉండగా కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చి మీ ఆశయం చేరుకోవడానికి మరొక రెండు నెలలు మాత్రమే ఉంది ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి పెట్టండి అని చెబుతుంది.
మరోవైపు రామా ఇంటికి వస్తుండగా తన స్నేహితుడు చరణ్ కలిసి తాను ఒక కొత్త కంపెనీ పెడుతున్నానని చదువుకున్న కుర్రాళ్ళు కావాలి అని అడగడంతో అఖిల్ కు జాబ్ చూడమని చెబుతాడు అప్పుడే తన ఫ్రెండ్ విసిటింగ్ కార్డ్ ఇచ్చి తనని కలవమని చెబుతాడు. ఇక ఇంటికి అఖిల్ వచ్చిన అనంతరం జాబ్ వచ్చిందా అని మల్లికా అడుగుతుంది. నువ్వు చదువుకున్న చదువుకి హైదరాబాద్లో ఉద్యోగం చేయాలి..ఇక్కడ ఉద్యోగం వస్తుందని పుల్లలు వేస్తుంది నా మాట విని మీ చిన్నన్నయ్య బట్టలు కొట్టులో ఏదో ఒక పని చెయ్యి అంటూ మల్లిగా చెప్పడంతో అఖిల్ మనసులో తిట్టుకుంటాడు.