అబార్షన్ అయిందంటూ మరో కొత్త నాటకం ఆడుతున్న మల్లిక…. రామాకు నిజం చెప్పిన జానకి!

కుటుంబ గొప్పతనం గురించి తెలియజేస్తూ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… మాధురి కేసును చాలా సీరియస్ గా తీసుకొని విచారిస్తున్న జానకి సంఘటన స్థలానికి వెళ్లడంతో అక్కడ రింగ్ దొరుకుతుంది ఎవరు కొన్నారు ఏంటి అని బంగారు షాప్ అతను దగ్గరికి వెళ్ళగా ఆయన వివరాలు ఇవ్వడానికి సంకోచిస్తాడు.దీంతో జానకి తాను త్వరలోనే ఐపీఎస్ కాబోతున్నానని ఇది ఒక అమ్మాయి జీవితంతో ముడిపడి ఉంది చెప్పమని అడగడంతో ఆ ఉంగరం కార్పొరేట్ గారి అబ్బాయి కన్నబాబు కొన్నారని చెప్పగా జానకి షాక్ అవుతుంది.

కన్నబాబుకి మాధురికి మధ్య ఏం జరిగింది తనని ఎందుకు చంపాలి అనుకున్నారు అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు తన దొంగ కడుపు విషయం బయట పడుతుందని మల్లికా ఆలోచిస్తూ నీలావతి పెద్దమ్మను రమ్మంటుంది.తనకు దొంగ కడుపు అనే విషయం జానకికి తెలిసిపోయిందని చెప్పడంతో నీలావతి భయంతో పరుగులు పెట్టగా ఈ నాటకంలో నీ ప్రమేయం కూడా ఉందని తెలిస్తే పరిస్థితి ఆలోచించుకో అని చెప్పగా నీలావతి మరొక ప్లాన్ చెబుతుంది.

దీంతో మల్లిక అందరూ వారి పనులలో నిమగ్నమైనప్పుడు నేలపై నూనె పోసి ఉద్దేశపూర్వకంగానే జారిపడి డైనింగ్ టేబుల్ కుర్చీ తన కడుపుపై వేసుకుంటుంది. మల్లికా అరవడంతో కుటుంబ సభ్యులందరూ కంగారుగా వచ్చి తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్తారు.అయితే నీలావతి ముందుగా అక్కడ డాక్టర్ల అందరిని డబ్బులు ఇచ్చి అరెంజ్ చేసి తనకు కడుపుపై బలంగా దెబ్బ తగలడం వల్లే అబార్షన్ అయిందని చెప్పిస్తుంది. ఇలా మల్లిక దొంగ కడుపు విషయం బయటపడకుండా మాస్టర్ ప్లాన్ వేసి తనకు కడుపుపోయిందని నాటకం ఆడుతారు.

డాక్టర్ ఆ విషయం చెప్పగానే అందరూ బాధపడతారు జానకి మాత్రం అసలు లేని కడుపుకు అబార్షన్ కావడం ఏంటి అని నీలావతి వైపు చూడగా నీలావతి భయంతో వణికి పోతుంది. అంతలో నర్స్ వచ్చి పేషెంట్ ని తీసుకు వెళ్ళచ్చు అని చెప్పగా దొంగ కడుపు విషయం ఎక్కడ బయట పడుతుందోనని ఇలాంటి డ్రామాలు ఆడారు అనుకొని జానకి మల్లికవైపు నీలావతి వైపు చాలా కోపంగా చూస్తుంది.ఇలా కడుపు పోవడంతో జ్ఞానంభ ఇతర కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు.
ఇక తర్వాత ఎపిసోడ్లో భాగంగా రామ జానకి వద్దకు వచ్చి పాపం మల్లికాకు కడుపుపోయిందని ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు అంటూ చెప్పడంతో జానకి అసలు మల్లికకు కడుపేలేదని అసలు విషయం చెప్పడంతో రామా ఒక్కసారిగా షాక్ అవుతారు.