రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా హీరో వల్లే హిట్ అయ్యింది:రమా రాజమౌళి

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ దక్షకుడిగా గుర్తింపు పొందిన రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా రాజమౌళి దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా మొదలుకొని ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ప్రతి సినిమాకి రాజమౌళి దర్శకుడిగా తన మార్క్ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. ఇలా తన దర్శకత్వ ప్రతిభతో రాజమౌళి తెలుగు సినీఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు.

ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటున్న రాజమౌళి మాత్రం భార్య ప్రశంసలు అందుకోలేకపోతున్నాడు. రాజమౌళి భార్య రమ ఆయనకి తోడుగా సినిమా ఇండస్ట్రీలోనే పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో రాజమౌళి గురించి రమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో యముడిగా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది. అయితే ఈ సినిమా హిట్ అవ్వటానికి రాజమౌళి దర్శకత్వం కారణం కాదని , కేవలం ఎన్టీఆర్ నటన వల్లే యమదొంగ సినిమా హిట్ అయిందని రమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకి సినీ విమర్శకుల ప్రశంసలు తగ్గటమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా వరించాయి. తాజాగా ఈ సినిమాలోని నాటునాటు పాటకి గోల్డెన్ గ్లోబల్ అవార్డు కూడా లభించింది. అంతే కాకుండా ఆస్కార్ బరిలో కూడా ఉంది. ఇలా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డులు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.