సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు సినిమాలలో హీరోగా నటిస్తూ లక్షల సంఖ్యలో అభిమానుల్ని సొంతం చేసుకుంటే… అతని కూతురు సితార మాత్రం సినిమాలలో నటించకుండానే అతి చిన్న వయసులో సోషల్ మీడియాలో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ తండ్రి కూతుర్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ముచ్చటగా ఉంటుంది.
ఇటీవల మహేష్ బాబు సితార కలిసి బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ షో కి గెస్ట్ గా హాజరయ్యారు. వీరిద్దరూ ఆ డాన్స్ షోలో కంటెస్టెంట్లు వేసిన డాన్స్ కి ఫిదా అయ్యారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు సైలెంట్ గా ఉన్నట్టు కనిపించినా కూడా స్పాంటేనియస్ గా ఇతరుల మీద పంచులు వేస్తూ ఉంటాడు. అయితే ఈ డాన్స్ షోలో మహేష్ బాబు కూతురు సితార తన తండ్రికి అదిరిపోయే పంచ్ వేసింది.
ఈ డాన్స్ షోలో సితార తన తండ్రిని ఒక ప్రశ్న వేస్తూ ఒక బౌల్ లో ఉన్న వేడివేడి పాలను పిల్లి తాగితే ఏమవుతుంది? అని అడగ్గా.. మహేష్ బాబు చాలా సీరియస్ గా ఆలోచించి మూతి కాలిపోతుందని సమాధానం చెప్పాడు. అయితే సితార మాత్రం అది రాంగ్ ఆన్సర్ అని చెబుతుంది. ఆన్సర్ ఏంటో నువ్వే చెప్పు అని మహేష్ బాబు అనగా.. బౌల్ ఖాళీ అయిపోతుంది అని చెప్పి మహేష్ బాబుకి కౌంటర్ వేస్తుంది. దీంతో మహేష్ బాబు తన కూతురు తెలివి చూసి మురిసిపోతాడు. ఈ డాన్స్ షో కి సంబంధించిన సితార మహేష్ బాబు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.