బిగ్ బాస్ సీజన్ 6 తమిళ్ లో ఎంట్రీ ఇవ్వనున్న మహాలక్ష్మి రవీందర్..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన రవీందర్ ఇటీవల మహాలక్ష్మి అనే సీరియల్ నటిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలాకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యింది. ఇలా వివాహం చేసుకోవడంతో సోషల్ మీడియాలో వీరిద్దరూ ట్రెండింగ్ కపుల్ గా మారిపోయారు. వీరిద్దరూ ఏం చేసినా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇదిలా ఉండగా వీరిద్దరికీ సంబంధించిన మరొక వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది.

నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన రవీందర్ బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ భాషలో ఇప్పటికే ఐదు సీజన్ లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఆరవ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అక్టోబర్ 9 వతేదీ నుండి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహాలక్ష్మి రవీందర్ పేర్ల కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ల లిస్టులో వినిపిస్తున్నాయి. దీంతో రవీందర్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న రవీందర్ ని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల హనీమూన్ కి వెళ్లిన ఈ జంట అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కపుల్ గా గుర్తింపు పొందిన ఈ జంట బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంట్రీ ఇవ్వనున్నారా? లేదా? అన్న విషయం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.