వివాహితులకు ఒడిబియ్యం పెట్టడానికి గల కారణం ఏమిటి.. ఒడిబియ్యం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

మన హిందూ సంస్కృతిలో అనేక ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రజలందరూ ఈ సాంప్రదాయాల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ వాటిని ఆచరిస్తూ ఉంటారు. ఇలాంటి సాంప్రదాయాలలో వడి బియ్యం కూడా ఒకటి. సాధారణంగా వివాహం జరిగిన తర్వాత పుట్టింటి వారు తమ కూతుర్లకు అప్పుడప్పుడు వడిబియ్యం పోస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఏడూ కూతురిని ఇంటికి పిలిచి తల్లిదండ్రులు తమ స్తోమత కి తగ్గట్టు కొత్త బట్టలు తెచ్చి వడి బియ్యం పోస్తూ ఉంటారు. అయితే ఇలా ఆడపిల్లలకు తల్లితండ్రులు వడిబియ్యం పెట్టడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒడి బియ్యం సాంప్రదాయం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే… సాధారణంగా మనిషి శరీరంలో నాడులు కలిసే ప్రతి చోట ఒక చక్రం ఉంటుంది. ఇలా మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. ఈ ఏడు చక్రాలలో గౌరీదేవి ఏడు రూపాయలలో నిక్షిప్తమై ఉంటుంది.అందులో ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో ఒడ్డి యాన పీఠం ఉంటుంది. ఈ ఒడ్డి యాన పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మి గా భావిస్తారు. అందువల్ల వివాహం జరిగిన తర్వాత ఆడపిల్లలకు వడిబియ్యం సమర్పించడం అంటే ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మి అనే శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.

అందువల్ల ఆడపిల్లలను తల్లిదండ్రులు ఇంటి ఆ ఇంటికి మహాలక్ష్మి గా భావించి వివాహం తర్వాత వాడి బియ్యం పోస్తూ ఉంటారు. ఆ సమయంలో కూతురిని మహాలక్ష్మి గా భావించి ఆమె పక్కన ఉన్న భర్తని మహావిష్ణువు గా భావిస్తారు. తల్లి ఒడి అంటే ఒక రక్షణ నిలయం. అంటే మహాలక్ష్మి గా భావించే ఆడపిల్లలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులకు రక్షణగా నిలుస్తారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు ఒడిబియ్యం పోసే సమయంలో బియ్యం మాత్రమే కాకుండా అష్టైశ్వర్యాలను కూడా పోస్తారు. అంటే తమ బిడ్డ జీవితాంతం అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ తల్లిదండ్రులు ఆశిస్తారు. ఆ సంతోషంతో కూతురు తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని తన ఒడిబియ్యం లో నుండి ఐదు పిడికిల్ల బియ్యం తన పుట్టింటికి ఇచ్చి పుట్టినింటి మహా ద్వారానికి పసుపు కుంకుమ పెట్టి అత్తింటికి వెళుతుంది.