కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం రేపిన నిర్మాత రవీందర్ పెళ్ళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ ప్రేమించుకుని ఇటీవల పెళ్ళి చేసుకున్నారు . అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావటం గమనార్హం. ఇలా వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వీరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రమే కాకుండా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేశారు.
అయితే వీరిద్దరూ ఆ ట్రోలింగ్ గురించి పట్టించుకోకుండా వారి జీవితాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తూ వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వీరి పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దీపావళి సందర్భంగా ఈ పాపులర్ కపుల్స్ ఇద్దరు దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకొని ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలలో రవీందర్ పట్టు పంచే, పట్టు చొక్కా ధరించి ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాడు. ఇక మహాలక్ష్మి చుడీదార్ లో చాలా అందంగా కనిపిస్తోంది. వీరి దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినా కొంతమంది నెటిజన్స్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం కాకి ముక్కుకి దొండ పండు అంటూ వీరిని ఇప్పటికి ట్రోల్ చేస్తున్నారు.