సెలబ్రిటీ కపుల్ మహాలక్ష్మి రవీందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ తమిళ నటి మహాలక్ష్మి ఇటీవల నిర్మాత రవీందర్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. మహాలక్ష్మి తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రవీందర్ ని రెండవ వివాహం చేసుకుంది. రవీందర్ కూడా తన మొదటి భార్య వదిలేయడంతో మహాలక్ష్మిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా మహాలక్ష్మి సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ మంచి పీక్ లో ఉన్న సమయంలో అనిల్ నేరేడిమిల్లి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. అయితే బాబు పుట్టిన తర్వాత మహాలక్ష్మి మరొక నటుడితో వివాహేతర సంబంధం కొనసాగించిందని అందువల్లే ఆమె మొదటి భర్త ఆమెకు విడాకులు ఇచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలలో నిజం లేదని మహాలక్ష్మి కొట్టి పారేసింది. అటువంటి క్లిష్ట సమయంలో నిర్మాత రవీందర్ మహాలక్ష్మికి తోడుగా ఉంటూ ఆమెకు సహకరించాడు. ఇలా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వెళ్ళింది. వీరి పెళ్లి విషయం బయటకు తెలిసిన వెంటనే ఇద్దరిని సోషల్ మీడియా లో తెగ ట్రోల్ చేశారు.
మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే రవీందర్ ని పెళ్లి చేసుకుందని వార్తలు వినిపించాయి. అయితే తమ పెళ్లి విషయంలో వచ్చిన వార్తలపై ఈ జంట స్పందిస్తూ.. తామిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. డబ్బు కోసమే పెళ్లి చేసుకున్న అన్న వార్తలను మహాలక్ష్మి పొట్టి పారేస్తూ నటిగా తను నెలకు దాదాపు నాలుగు లక్షల వరకు సంపాదిస్తున్నారని కేవలం రవీందర్ మీద ఉన్న ప్రేమ వల్లనే అతనిని వివాహం చేసుకున్నానని వెల్లడించింది. ఇక వీరిద్దరి పెళ్లి జరిగినప్పటి నుండి సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికి కొంతమంది ఈ జంట గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే వీరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వారి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.