సుధీర్- రష్మీ మధ్య లవ్ ఎఫైర్… చెప్పిన నమ్మటం లేదు అంటూ క్లారిటీ ఇచ్చిన సుదీర్..!

జబర్దస్త్ ద్వారా ప్రేమికులుగా ఫేమస్ అయిన సుధీర్ రష్మీ జంట గురించి తెలియని వారంటూ ఉండరు. కమెడియన్ గా అందరిని నవ్వించే సుధీర్ అందాల యాంకర్ రష్మి మధ్య ప్రేమ చిగురించింది. జబర్దస్త్ వేదికగా చిగురించిన వీరి ప్రేమ బుల్లితెర వర్గాలలో హాట్ టాపిక్ గా నిలిచారు. చాలాకాలం పాటు వీరిద్దరి జబర్థస్త్, ఢీ వంటి టీవీ షోస్ లోనే కాకుండా ఇతర ప్రత్యేక కార్యక్రమాలలో కూడా ఒకరిని ఒకరు ప్రపోజ్ చేసుకోవటం రొమాంటిక్ పాటలకు డాన్సులు వేయటం అందరి ముందే పెళ్లిళ్లు చేసుకోవడం వంటి పనుల వల్ల వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు భావించారు.

అయితే కొంతకాలం తర్వాత వీరి ప్రేమ జంట టిఆర్పి రేటింగ్స్ కోసం మల్లెమాల వారు సృష్టించినది అని ప్రేక్షకులకు అర్థమయిపోయింది. అయితే రష్మీ కూడా చాలా సందర్భాలలో తమ మధ్య ప్రేమ లేదని ఇద్దరం కేవలం మంచి స్నేహితులమని వీరి ప్రేమపై వస్తున్న వార్తలను కొట్టి పారేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుడిగాలి సుధీర్ కి కూడా మళ్లీ ఇదే ప్రశ్న ఎదురయింది. రష్మితో తనకున్న రిలేషన్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సుధీర్ సమాధానం చెప్పి వారి రిలేషన్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు.

ఈ క్రమంలో సుధీర్ మాట్లాడుతూ… ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా ? అని అడుగుతున్నారు. మా ఇద్దరిమధ్య ప్రేమ లేదని.. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పినా వినడం లేదు. ఇద్దరం చాలా కాలం కలిసి పనిచేయటం వల్ల మా మధ్య ప్రేమ బంధం ఉందని ప్రజలు అపోహపడుతున్నారు. రష్మీ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మేమిద్దరం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాం. కేవలం షో కోసం మాత్రమే అల నటించాం. అంతకు మించి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అంటూ రష్మి తో తనకున్న రిలేషన్ గురించి సుధీర్ మొదటిసారి క్లారిటీ ఇచ్చాడు. ఇకనైనా వీరిపై వస్తున్న రూమర్లకు చెక్ పడుతుందో? లేదో? చూడాలి మరి.