ఇంట్లో వాళ్లకు చుక్కలు చూపిస్తున్న లాస్య…. చిన్ననాటి స్నేహితులను కలుసుకున్న తులసి!

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే….తులసి తన చిన్నప్పటి ఇంటికి వెళ్లి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఒక్కో వస్తువును తీసి వాటి చరిత్ర చెబుతూ ఉంటుంది. తులసి ఇలా చెబుతూ ఉంటే సామ్రాట్ మాత్రం వాటిని విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరోవైపు లాస్య అన్న మాటలకు అంకిత బాధపడుతూ ఉంటుంది.అక్కడికి అనసూయమ్మ పరంధామయ్య వెళ్లడంతో చూశారా తాతయ్య లాస్య ఆంటీ సిచువేషన్ తనకు అనుకూలంగా మార్చుకొని అంకుల్ దగ్గర నన్ను బ్యాడ్ చేసిందని బాధపడుతుంది.

పేద వాళ్లకు ఫీజు తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం మంచి పనే కదా అని అడుగుతుంది. అంతలో అభి వచ్చి మనుషులు ఎలాంటి వారైనా మంచి చెబితే వినాలి అని అంకితకు క్లాస్ తీసుకుంటాడు.లాస్య ఆంటీ అయినా ఏమంది మనం కొంత సంపాదించిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఉచితంగా వైద్యం చేయమని చెప్పింది. ముందు మనం కూడా నాలుగు రాళ్లు వెనకేసుకొని ఎదగాలి కదా అంటాడు. దీంతో అంకిత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

ఇక తులసి సామ్రాట్ ఇంటి నుంచి బయటకు వస్తూ గేటు దగ్గర ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటోలు దిగుతారు. పరంధామయ్య పేపర్ చదువుకుంటూ తూలుతూ ఉంటాడు. అది చూసినటువంటి అనసూయ శృతి ఇద్దరూ నవ్వుకుంటారు. తనకు నిద్ర వస్తుందని కాస్త టీ ఇవ్వమని అడగడంతో శృతి లాస్య వద్దకు వెళ్లి ఫ్రిజ్ తాళాలు అడుగుతుంది. ఇప్పటికే రెండుసార్లు టీ కాఫీల వాటా అయిపోయింది. ఇకపై ఇవ్వడం కుదరదు అంటూ లాస్య శృతిని నానా మాటలు అంటుంది. దీంతో లాస్య బాధపడుతూ వెను తిరుగుతుంది.

మరోవైపు సామ్రాట్ తులసి ఇద్దరు కారులో వెళుతూ ఉండగా వారి కారుకు ముగ్గురు మహిళలు అడ్డుగా ఉంటారు. దీంతో తులసి సామ్రాట్ ఇద్దరు కిందికి దిగడంతో సామ్రాట్ ను ఉద్దేశిస్తూ ఓ మహిళ ఇక్కడ నీకు ఎలాంటి డైలాగ్స్ లేవు కేవలం నిలుచొని ఉండడమే అని చెబుతుంది. దీంతో తులసి వాళ్ళు తన చిన్ననాటి స్నేహితులని గుర్తించి వారిని ఒక్కసారిగా కౌగిలించుకొని ఎంతో సంబరపడుతుంది.ఇందులో ఒక మహిళ తులసి సామ్రాట్ ఇద్దరు కూడా భార్యాభర్తలని భావించి ఈడు జోడు చాలా సూపర్ గా ఉందని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా పిల్లలు ఎంతమంది అంటూ వరుస ప్రశ్నలు వేస్తుంది. ఇంతలోనే ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.