స్నేహితుల ముందు దివ్యని అవమానించిన లాస్య…. స్పృహ తప్పి పడిపోయిన శృతి!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే దివ్య యానివర్సరీ ఫంక్షన్ కోసం తన స్నేహితులతో కలిసి ఇంట్లో పెద్ద ఎత్తున సౌండ్ పెట్టుకొని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది.దివ్య తన స్నేహితులతో పాటు పరంధామయ్య అనసూయ శృతి అంకిత కూడా కలిసి డాన్స్ చేస్తూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక సౌండ్ ఎక్కువగా రావడంతో చిరాకు పడిన లాస్య వెంటనే వెళ్లి మ్యూజిక్ ఆఫ్ చేస్తుంది. దీంతో ఎందుకు ఆఫ్ చేసావ్ అని దివ్య అడగ్గా అంత గట్టిగా సౌండ్ పెట్టుకున్నారు అని మాట్లాడుతుంది.

ఇది ఇల్లా లేకుంటే రికార్డింగ్ స్టేజా అని లాస్య అనడంతో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాస్త ఓపిక పట్టొచ్చు కదా అని దివ్య అనడంతో ఇంతసేపు అదే చేశాను ఓపిక నశించే ఇలా సౌండ్ ఆఫ్ చేశాను అని లాస్య మాట్లాడుతుంది..ఇక పెద్దవాళ్లు కూడా ఇక్కడికి చేరి తైతక్కలాడుతుంటే నీకు భయం చెప్పే వాళ్ళు ఎవరున్నారని లాస్య దివ్య స్నేహితుల ముందు అనరాని మాటలు అంటుంది.అంతలోపు నందు అక్కడికి రావడంతో ఏమైంది అని అడగ్గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తానంటే ఒప్పుకున్నాను సౌండ్ ఎక్కువగా పెట్టుకుని మరి గంతులు వేస్తున్నారు. పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అని లాస్య ఉన్నవి లేనివి చెబుతుంది.

అందుకే మ్యూజిక్ ఆఫ్ చేశానని చెప్పడంతో దివ్య అరుస్తుంది. అనగా పెద్ద వాళ్లకు కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడటం నేర్చుకో అని నందు లాస్యకు వత్తాసు పలకడంతో దివ్య తన ఫ్రెండ్స్ ముందు పరువు పోయిందని ఏడుస్తుంది.ఇక అంకిత శృతి తనని ఓదారుస్తూ తనని స్నేహితులకు పిన్ని అని పరిచయం చేయలేదన్న కోపంతోనే ఇలా చేసింది అని మాట్లాడతారు.నాకు ఇక్కడ ఉండాలనిపించలేదు వెళ్ళిపోదాం అంటూ మాట్లాడదాం ప్రస్తుతం నందు పరిస్థితి బాగోలేదు తనుకు ఏదైనా ఉద్యోగం వస్తే పరిస్థితులు చక్కబడతాయని అనసూయ పరంధామయ్య చెప్పడంతో అప్పుడే అక్కడికి అభి ప్రేమ్ వచ్చి ఏం జరిగిందని విషయం మొత్తం తెలుసుకొని డాడ్ కి జాబ్ వచ్చేవరకు ఎదురు చూద్దామని చెబుతారు.

మరోవైపు తులసి సామ్రాట్ భజన మొదలవుతుంది సామ్రాట్ తులసిని పొగుడుతూనే ఉంటారు.తన డాన్స్ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని తులసి ఫోన్ చేస్తుంది. అయితే ఫోన్ ఎవరు చేశారనే విషయం కూడా గమనించకుండా దివ్య కాల్ కట్ చేస్తూనే ఉంటుంది.చివరికి తన తల్లి ఫోన్ చేసిందని తెలియగానే డాన్స్ ప్రాక్టీస్ ఎక్కడి వరకు వచ్చింది కనుక్కుందామని ఫోన్ చేశాను అని తులసి అనడంతో తల్లి ఉన్నా కూడా నేను అనాధను ఇక్కడ ఇంతమంది ఉన్న ఒంటరి దాన్నే అని ఎమోషనల్ అవుతుంది.

మరోవైపు పరంధామయ్యకు కడుపులో మంట రావడంతో అంకిత కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగా తాళం ఉండటం చూసి ఇదేంటి ఫ్రిజ్ కు తాళం వేసి ఉంది అని అంకిత అడుగుతుంది. దీంతో శృతి జరిగినది మొత్తం చెప్పడంతో అంకిత లాస్యను కీస్ కావాలని అడుగుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తికాగా, తరువాత ఎపిసోడ్ లో శృతి ఉన్నఫలంగా స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది.