Home TV SHOWS Bigg boss 4: నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని నాగ్ చెప్పగానే లాస్య ఎందుకు నవ్వింది?

Bigg boss 4: నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని నాగ్ చెప్పగానే లాస్య ఎందుకు నవ్వింది?

లాస్య.. చిరునవ్వుకు కేరాఫ్ అడ్రస్. కానీ.. ఎప్పుడూ నవ్వితే దాన్ని ఏమనాలి. ప్రతి విషయాన్ని నవ్వుతూ సమాధానం ఇస్తోంది అంటే తను సేఫ్ గేమ్ ఆడుతున్నట్టేనా? తను ఆడేది సేఫ్ గేమ్ అని మరోసారి రుజువయింది. సరే.. తన సేఫ్ గేమ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ.. నిన్నటి ఎపిసోడ్ లో లాస్య ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

Lasya Already Expected Her Elimination From Bigg Boss House
lasya already expected her elimination from bigg boss house

లాస్య ఎలిమినేషన్ గురించి అందరికీ ముందే తెలిసిపోయింది. ఐమీన్.. ప్రేక్షకులకు. ముందే లాస్య ఎలిమినేషన్ గురించి లీక్ అయింది. అది ప్రతి వారం జరిగేదే? కిందటి వారం కూడా మొహబూబ్ ఎలిమినేషన్ గురించి ముందే అందరికీ తెలిసింది.

ఇక అసలు విషయం ఏంటంటే.. అందరూ సేవ్ అయ్యాక చివర్లో మిగిలింది లాస్య, అరియానా. ఈ ఇద్దరిలో ఒక్కరు ఇంటి నుంచి బయటికి పోవాలి. గ్లాస్ మీద అరియానా, లాస్య ఫోటోలను వేస్తూ.. చివర్లో ఆగిన వాళ్ల ఫోటోలో ఉన్న వాళ్లు సేవ్ అవుతారని.. ఫోటో రాని వాళ్లు ఎలిమినేట్ అవుతారని నాగ్ చెబుతాడు.

Lasya Already Expected Her Elimination From Bigg Boss House
lasya already expected her elimination from bigg boss house

చివరకు లాస్య ఫోటో కనిపించకుండా ఉండే సరికి.. అందరికీ లాస్య ఎలిమినేట్ అయినట్టు అర్థమయింది. నాగ్ కూడా అరియానా నువ్వు సేఫ్.. లాస్య నువ్వు ఎలిమినేట్ అని అనేసరికి.. మిగితా ఇంటి సభ్యులు కొంచెం భావోద్వేగానికి గురయినా… లాస్య మాత్రం ఏమాత్రం బాధపడకుండా చిరునవ్వు చిందించింది. ఓకే.. అంటూ వెంటనే బ్యాగ్ సర్దేసుకొని.. అందరూ బాగా ఆడండి అంటూ బయటికి వచ్చేసింది.

అంటే.. లాస్యకు తన ఎలిమినేషన్ గురించి ముందే తెలిసిపోయిందా? లేక ఇంట్లో ఉండలేక ఎలాగైనా వెళ్లిపోవాలని అనుకుందా? నాగ్ అడిగినప్పుడు కూడా నేను ఊహించాను.. అంటూ ఏదో కలరింగ్ ఇచ్చింది కానీ.. తనకు ఇక హౌస్ లో ఉండాలని లేదు.. ఎలిమినేటెడ్ అనగానే చిరునవ్వు చిందిస్తూ ఇంటి నుంచి వెళ్లిపోయింది లాస్య. ఇంటి సభ్యుల ప్రవర్తన కావచ్చు.. చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నావు.. అంటూ తనను చిరాకు తెప్పించడం కావచ్చు.. మొత్తం మీద లాస్యకు బిగ్ బాస్ హౌస్ మీద ఆసక్తి పోయింది. అందులోనూ తన కొడుకును మొన్న చూశాక.. ఆగలేకపోయింది. అందుకే.. సంతోషంతో ఇంటికి వెళ్లిపోయిందేమో అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Posts

Pavithra Lakshmi Amazing Stills

Pavithra Lakshmi Tamil Most popular Actress,Pavithra Lakshmi Amazing Stills ,Kollywood PPavithra Lakshmi Amazing Stills , Pavithra Lakshmi Amazing Stills Shooting spot ,Pavithra Lakshmi Amazing...

కాజల్ అగర్వాల్ పెళ్లి తరవాత నటించబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే.. భర్త కి స్క్రిప్ట్ వినిపించింది.

కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత సినిమాలు మానేస్తుందని ప్రచారం చేసిన వాళ్ళకి గట్టి షాకిచ్చింది. పెళ్ళి తర్వాత మొట్ట మొదటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇండస్ట్రీలో అందరికీ...

పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌.. న‌లుగురు కెప్టెన్స్‌తో మెగాస్టార్ పిక్ వైర‌ల్‌

ఆరు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మ‌ధ్య‌లో రాజ‌కీయాల వైపు వెళ్లిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌చ్చి అల‌రిస్తున్నారు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఖైదీ...

సూర్య – బోయపాటితో సినిమా ? వద్దు బాబోయ్ అంటున్న అతని ఫ్యాన్స్ ?

సూర్య రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ఆధారంగా లేడీ డైనమిక్ డైరెక్టర్ సుధ...

Latest News