డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చిందని తెలుసుకున్న దీప…. మరోసారి సౌందర్యను మోసం చేసిన మోనిత!

బుల్లితెర ప్రేక్షకులుఎంతగానో ఆదరిస్తున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేడు ఎన్నో ట్విస్టుల నడుమ కొనసాగింది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా కార్తీకదీపం సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… ఆపరేషన్ చేసిన తర్వాత దీపకు మెలకువ వచ్చి సౌర్య కోసం వెళ్లారా..శౌర్య దొరికిందా అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తుంటుంది మిమ్మల్ని నమ్ముకోవడం కన్నా నేనే వెళ్లి వెతుకోవడం మంచిదని దీపాలేస్తుండగా కార్తీక్ వద్దని చెబుతాడు. దీప వినకుండా ఉండేసరికి మరొక డాక్టర్ దీప మీద అరుస్తుంది. తను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాడు అని చెప్పగా ఆయన ఏమైనా నాకు ఆపరేషన్ చేశారా ఆయన ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పగా అవును అతనే నీకు ఆపరేషన్ చేశారు. ఈయన ఎవరనుకున్నావ్ డాక్టర్ కార్తీక్ ఫేమస్ కార్డియాలజిస్ట్ అని చెబుతుంది.

ఇలా డాక్టర్ చెప్పేసరికి దీపా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అంటే మీకు గతం గుర్తొచ్చిందా డాక్టర్ బాబు అని సంతోష పడుతుంది. కార్తీక్ అవునని చెప్పగా మీకు గతం ఎప్పుడు గుర్తుకు వచ్చిందని అడగా ఆరోజు సంగారెడ్డిలో దసరా ఉత్సవాలలో తనకు గతం గుర్తుకు వచ్చిందని చెబుతాడు.ఈ విధంగా దీప ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ ఉండగా కార్తీక్ తనకు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెడతాడు.మరోవైపు మోనిత ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే ఈ క్రమంలోనే తన కుమారుడిని తీసుకొని బయటకు వెళ్తుండగా హిమా అడ్డుకుంటుంది.

ఎక్కడికి వెళ్తున్నావని హిమ అడగగా చిన్న పనుంది ఇప్పుడే వస్తానని చెబుతుంది. హిమ అడ్డుకునే ప్రయత్నం చేసిన వినకుండా త్వరగా క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ డ్రైవర్ కు ఎక్కువ డబ్బు ఇచ్చి ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళమని చెబుతుంది.అలా వెళ్లిన మోనిత ఎంతసేపటికి రాకపోగా సౌందర్య రావడంతో హిమ జరిగినది మొత్తం చెబుతుంది. దీంతో సౌందర్య వాళ్ళు చెప్పింది నిజమేమో కార్తీక్ దీప బతికే ఉన్నారేమో అందుకే ఇది ఇంతలా కంగారుపడుతుంది అంటూ అనుమాన పడుతుంది.

మరోవైపు మెలకువ వచ్చిన దీప పదేపదే కార్తీక్ డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ పిలుస్తూ ఉంటుంది. మీకు గతం గుర్తొచ్చినా ఎదురుగా ఉన్న నాకు ఈ విషయం చెప్పలేదు. ఇలా చెప్పకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తుంది.చెప్పకపోవడానికి మోనితనే కారణం అని కార్తీక్ చెప్పగా నాకు గతం గుర్తొచ్చిందని చెబితే నేను తనకు చెప్పే దాన్ని కాదు కదా మీకోసం ఎంతలా బాధపడ్డాను అని దీప చెబుతుంది.ఇలా దీప ప్రశ్నలపై ప్రశ్నలు వేయడంతో నీ ప్రశ్నలు అన్నింటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి ఏదో ఒక రోజు చెబుతానని తనని రెస్ట్ తీసుకోమంటారు.

మరోవైపుఇంద్రుడు దీపా కార్తిక్ కోసం వెతుకుతూ ఉన్నప్పటికీ వాళ్లు మాత్రం కనిపించరు.ఇంటికి వెళ్ళగానే చంద్రమ్మ కనిపించారా అని ప్రశ్నించగా కనిపించలేదు అంటూ నిరాశగా సమాధానం చెబుతారు. వాళ్లు అడిగినప్పుడు మనం శౌర్యను ఇవ్వలేదు సౌర్యమ్మతో పాటు మనం కూడా వెళ్లి ఉండొచ్చు కదా అంటూ బాధపడతారు. అదే సమయంలో సౌర్య అక్కడికి రావడంతో ఏమైంది బాబాయ్ అని అడగ్గా వాళ్లు ఏదో అబద్ధాలు చెప్పి మాట మారుస్తారు.